Begin typing your search above and press return to search.

ఈ ఆరు రాష్ట్రాల నుంచి ఏపీకి వెళుతుంటే.. జర జాగ్రత్త..

By:  Tupaki Desk   |   2 Jun 2020 4:45 AM GMT
ఈ ఆరు రాష్ట్రాల నుంచి ఏపీకి వెళుతుంటే.. జర జాగ్రత్త..
X
లాక్ డౌన్ ను ఎత్తేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయా రాష్ట్రాల వారు తమకు తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకునే వెసులుబాటు కల్పించింది. అంతర్ రాష్ట్రాల మధ్య రాకపోకలకు కేంద్రం ఓకే చెప్పినా.. తుది నిర్ణయం మాత్రం ఆయా రాష్ట్రాలదే. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో ఏ రాష్ట్రం నుంచైనా వచ్చేందుకు వీలుగా తలుపులు ఓపెన్ చేస్తే.. అందుకు భిన్నమైన పరిస్థితులు ఏపీలో ఉన్నాయి.

వివిధ రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారి విషయంలో అక్కడి ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోంది. ఉదాహరణకు తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే వారి విషయంలో ఒకలా వ్యవహరిస్తే.. తమిళనాడు.. కర్ణాటక.. కేరళ.. తదితర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో మరోలా వ్యవహరిస్తోంది. తెలంగాణ నుంచి ఏపీకి రైల్లో వచ్చే ప్రయాణికుల్లో.. ప్రతి బోగీలో నుంచి 5 శాతం ప్రయాణికుల్ని ర్యాండమ్ పద్దతిలో నమూనాలు సేకరిస్తారు. హోం క్వారంటైన్ చెబుతారు.

అదే సమయంలో మహారాష్ట్ర.. గుజరాత్.. ఢిల్లీ.. మధ్యప్రదేశ్.. తమిళనాడు నుంచి వచ్చే వారి నమూనాల్ని రైల్వే స్టేషన్లను సేకరిస్తారు. అంతేకాదు.. వారిని ఏడు రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్ కు తరలిస్తారు.అక్కడ ఏడు రోజులు ఉంచిన తర్వాత మరో ఏడు రోజులు హోం క్వారంటైన్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఒకవేళ.. ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే వారిలో 60 ఏళ్లు దాటిన వారికి.. పదేళ్ల లోపు చిన్నారులు.. గర్భిణులు.. బాలింతలు.. తీవ్ర అనారోగ్యంతో బాధ పడేవారికి మినహాయింపులు ఇచ్చారు. వీరందరికి ప్రభుత్వ క్వారంటైన్ లేకున్నా.. ఇంట్లోనే పద్నాలుగు రోజుల పాటు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. సో.. వేరే రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారంతా ప్రభుత్వ విధానాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.