Begin typing your search above and press return to search.

ఈ ఫోన్ నెంబరు.. ఏపీ ప్రజలకు అపర సంజీవిని!

By:  Tupaki Desk   |   13 Aug 2020 9:10 AM GMT
ఈ ఫోన్ నెంబరు.. ఏపీ ప్రజలకు అపర సంజీవిని!
X
గడిచిన కొద్ది రోజులుగా ఏపీలో రోజుకు పదివేల కేసుల వరకూ నమోదు కావటం.. ఆ రాష్ట్రంలో రోగుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. యావత్ దేశంలో 23.29లక్షల కేసులు నమోదు అయితే.. ఒక్క ఏపీలోనే 2.54లక్షల కేసులు నమోదైన తీరు చూస్తే.. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కరోనా ముప్పు ఎంత ఎక్కువగా ఉందో ఇట్టే అర్థమైపోతుంది. నిన్నటికి నిన్న పది వేల కేసులకు కాస్త తక్కువగా నమోదయ్యాయి.

పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదుకు తగ్గట్లే.. ఆ రాష్ట్రంలో మరణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. మంగళవారం ఒక్కరోజులో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా 93 మంది మరణించారు. రోజురోజుకి పెరుగుతున్న కరోనా తీవ్రత నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక హెల్ప్ లైన్ నెంబరును అందుబాటులోకి తెచ్చింది.

8297104104 నెంబరుకు ఫోన్ చేసిన వెంటనే మూడు ఆప్షన్లు వచ్చాయి. కరోనా పాజిటివ్ అయిన వారు భయపడకుండా.. వెంటనే ఈ నెంబరుకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. వారికి మూడు ఆప్షన్లు వస్తాయి. ఆ మూడింటిలో తనకు అవసరమైన దాన్ని సెలెక్టు చేసుకుంటే.. తనకు అవసరమైన సాయం పొందే వీలుంటుంది. ఈ నెంబరుకు చేసినంతనే వచ్చే మూడు ఆప్షన్లు ఏమన్నది చూస్తే..

ఒకటో అప్షన్

కోవిడ్ రోగ లక్షణాలు.. హోమ్ ఐసోలేషన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వస్తాయి. ఒకవేళ పరీక్ష ఫలితం రాకున్నా.. ప్రాథమిక సమాచారం తెలుసుకునే వీలుంటుంది.

రెండో ఆప్షన్

రెండో ఆప్షన్ ఎంపిక చేసుకుంటే.. పాజిటివ్ వచ్చి అప్పటికే హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారు.. కోవిడ్ కేర్ సెంటర్లలో చేరటానికి సాయం చేస్తారు. అంతేకాదు.. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి అవసరమైన అంబులెన్సు సౌకర్యంతోపాటు.. కోవిడ్ సంబంధిత కంప్లైంట్స్ ను తీసుకుంటారు.

మూడో ఆప్షన్

ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన మొబైల్యాప్.. వాట్సాప్ చాట్ బాట్.. కోవిడ్ వెబ్ సైట్ కోసం.. వైఎస్సార్ టెలీ మెడిసిన్ కు సంబంధించిన సమాచారం తెలుసుకునే వీలుంటుంది. ఈ ఫోన్ నెంబరుకు చేయటం ద్వారా.. తమకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం నుంచి తెలుసుకునే అవకాశం ఉంటుంది.