Begin typing your search above and press return to search.

అమరావతి నుంచి విశాఖకు వస్తే ఇన్ని ప్రయోజనాలా?

By:  Tupaki Desk   |   10 Jan 2020 4:30 PM GMT
అమరావతి నుంచి విశాఖకు వస్తే ఇన్ని ప్రయోజనాలా?
X
రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని సెక్రటేరియట్ ఉద్యోగులు మౌనంగానే వ్యతిరేకిస్తున్నారు. అయితే... ఉద్యోగుల్లో ఉన్న ఈ వ్యతిరేకతను గుర్తించిన జగన్ వారికి కొత్త రాజధానిలో మంచి లాభం చేకూర్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్మోహనరెడ్డి వేసిన హైపవర్ కమిటీ ఈ మేరకు కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది.

* ప్రతి ఉద్యోగికి విశాఖపట్నంలో 200 చదరపు గజాల స్థలం తక్కువ ధరకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

* ఈ స్థలాలకు ఉడా అనుమతులుంటాయి. రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి ఫీజు చెల్లించకుండానే రిజిస్ట్రేషన్ చేస్తారు.

* ప్రతి ఉద్యోగికి ఇల్లు కట్టుకోవడం కోసం హౌస్ బిల్డింగ్ అలవెన్స్ రూ. 25 లక్షలు ఇస్తారు.

* ఉద్యోగులకు అమరావతిలో ఇస్తున్నట్లుగానే 30 శాతం ఇంటద్దె భత్యం ఇస్తూ విశాఖలో జీవన వ్యయం అధికం కాబట్టి అదనంగా మరో 10 శాతం కూడా ఇవ్వబోతున్నారు.

* తమకిచ్చిన స్థలాల్లో ఇళ్లు కట్టుకునేవరకు వారికి నామమాత్ర అద్దెలకు ఇల్లు దొరికేలా చేస్తారు. అవివాహితులైతే అద్దె లేకుండా.. సాధారణ ఉద్యోగులకు రూ. 4 వేల అద్దెకు డబుల్ బెడ్ రూం ఇల్లు.. అదికారుల స్థాయి వారికి రూ. 6 వేల అద్దెకు ఇల్లు ఇస్తారు.

* ఇక అమరావతి నుంచి విశాఖకు మారుతున్నందుకు ట్రాన్స్ పోర్టు చార్జీలు కూడా భారీగా చెల్లిస్తారట. ఇవి రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు ఉంటాయి.

* మరో మూడేళ్ల వరకు వారానికి అయిదు రోజుల పని దినాలే ఉంటాయి.

* స్వస్థలాలకు వెళ్లేందుకు రాయితీపై ఆర్టీసీ బస్ పాసులిస్తారు.

* హైదరాబాద్ - విశాఖ మధ్య ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా సూపర్ ఫాస్ట్ రైళ్లు నడుపుతారు.

* డీఏ బకాయిలుంటే చెల్లించేస్తారు. కొత్త పీఆర్సీ ప్రకటిస్తారు.

* ఉద్యోగుల పిల్లలకు విశాఖలో ఏ స్కూల్లో కావాలంటే ఆ స్కూల్లో సీటు దక్కేలా చేస్తారు.

* క్యాంటీన్ - వైద్య సదుపాయాలు కల్పిస్తారు.