Begin typing your search above and press return to search.
పద్మావతి అలా అనుకోలేదు.. కానీ, జరిగిపోయింది.. వైసీపీలో చర్చ!
By: Tupaki Desk | 3 Jun 2023 9:00 AMవైసీపీ నేతలకు ప్రజల నుంచి నిరసన సెగ మామూలుగా తగలడం లేదు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు.. కానీ వారికి ప్రజల నుంచి నిరసన సెగ అనుకోని రీతిలో తగులుతుంది. అడగడుగునా వారిని అడ్డుకుని వారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గ్రామాలకు చేసిన అభివృద్ది ఏంటని.. యువత నుంచి పెద్దల వరకూ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.
తాజాగా అనంతపురం జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి నిరసన సెగ ఊహించని రీతిలో తగిలింది. నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం మండలం దండువారిపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకున్న గ్రామస్థులు.. ఎన్నికల హామీలపై నిలదీసి.. ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇంతవరకు ఎందుకు పరిష్కారం కాలేదని గ్రామస్థులు అడ్డుకున్నారు.
శ్మశాన వాటికతో పాటు ఇంటింటికీ తాగు నీరు అందిస్తామని చెప్పిన మాటలు నాలుగేళ్లు అయినా నెరవేర్చ లేదని ప్రశ్నించారు.. మాకు కచ్చితమైన సమాధానం చెప్పి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ప్రశ్నించారు.
పక్కనే కార్యకర్తలు, పోలీసులు ఉన్నప్పటికీ.. వారు కూడా ఏమీ స్పందించలేదు. ఎందుకంటే.. బలమైన ఎస్సీ నియోజకవర్గంలో ఏమాత్రం తేడా వచ్చినా.. వైసీపీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుందని.. సీనియర్ నాయకులు పోలీసులను కూడా మేనేజ్ చేసి.. వారు మౌనంగా ఉండేలా చేశారని టాక్.
దీంతో పద్మావతికి ఊహించని షాక్ తగిలింది. నిజానికి ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రజలు నిలదీస్తే.. వెంటనే పోలీసులు వారిని అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. పద్మావతి విషయంలో మాత్రం అలా జరగలేదు.
దీనికి కారణం.. ఇక్కడ వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయి. పద్మావతి వర్గం వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోకుండా మరో వర్గం ప్రయత్నిస్తోంది. దీంతో వారు ఇక్కడి సమస్యలపై నిలదీస్తున్న సమయంలో కార్యకర్తలను కంట్రోల్ చేశారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి పద్మావతి అలా.. జరుగుతుందని అనుకోలేదు. కానీ, జరిగిపోయింది.