వైరల్ః ఈ బ్యాచ్ లో మీరు చేరకండి అంటున్న ఆనంద్ మహీంద్రా!

Wed Jul 21 2021 23:00:02 GMT+0530 (IST)

Anand Mahindra says you should not join this batch

ఎంతో మంది సోషల్ మీడియాలో ఉండొచ్చు. కానీ.. కొందరి పోస్టులు ఎప్పటికీ స్పెషల్ గా ఉంటాయి. అలాంటి వాటిని మాత్రమే వాళ్లు పోస్టు చేస్తుంటారు. అందులో ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అది వెంటనే వైరల్ అయిపోతుంది. 'ఆనంద్ మహీంద్రా..' కూడా అలాంటి వారే. ఆయన పోస్టుల కోసం ఎదురు చూసేవారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన ట్వీట్ చేశారంటే సమ్ థింగ్ స్పెషల్ ఉంటుంది.తనదైన సెన్సాఫ్ హ్యూమర్ తో ఒకసారి నవ్విస్తారు. రీసెర్చ్ చేసిన వ్యక్తిలా మరోసారి కొత్త విషయాన్ని అందిస్తారు. ఇంకోసారి సమాజ హితాన్ని కోరే వ్యక్తిలా.. ఏదో ఒక సందేశం ఇస్తారు. ఇలా తనదైన రీతిలో ప్రతీ అంశంపై వ్యాఖ్యానం జోడించే ఆనంద్ మహీంద్రా.. తాజాగా ఓ పోస్టు చేశారు. ఈ సారి చేసిన పోస్టు బాధ్యతను గుర్తు చేయడంతోపాటు.. బలాదూర్ వ్యవహారాన్ని ఒక్క ట్వీట్ తో ఖండించారు.

ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ కారు వీధుల్లో రయ్య్ మని దూసుకెళ్తోంది. ఆ కారు ఓనర్.. ఒక ప్రవాస భారతీయుడు. ఈ కారును వీడియో తీయించుకున్న సదరు ప్రవాస భారతీయుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అందులో ప్రత్యేకత ఏముందంటే.. ఆ కారుపై ఓ కొటేషన్ రాసి ఉంది. ''ఇండియన్ అమెరికన్ విత్ ప్యూర్ గోల్డ్ పెరారీ కార్'' అని రాశాడు.

అంటే.. ఆ కారు మొత్తం నిజమైన బంగారంతో కోటింగ్ వేయించాడు. కారు మొత్తం బంగారం కోటింగ్ వేయించాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలిసిందే. ఈ వీడియోను పోస్టు చేసిన ఆనంద్ మహీంద్రా ఇలా రాశారు. ''ఈ వీడియో ఎందుకు వైరల్ అయ్యిందో నాకు అర్థం కావడం లేదు. మనం ధనవంతులం అయినంత మాత్రాన డబ్బు ఎలా ఖర్చు పెట్టకూడదో.. దీని ద్వారా మనం పాఠం నేర్చుకోవచ్చు. అందుకు తప్ప ఇందులో మరో విషయం ఏముందని వైరల్ గా మారిందో?'' అని ట్వీట్ చేశారు.

దీంతో.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్ అయ్యింది. చాలా మంది ఆయనకు మద్దతుగా కామెంట్ చేశారు. డబ్బులు ఉన్నాయని దుబారా చేయడం సరికాదని అంటున్నారు. మరి ఆ కారు వ్యవహారం ఏంటో మీరు కూడా చూసేయండి.