Begin typing your search above and press return to search.

జగన్ తో ఆ భాగ్యం కలగలేదు అంటూ ఆనం సెటైర్లు...!

By:  Tupaki Desk   |   1 April 2023 3:25 PM GMT
జగన్ తో ఆ భాగ్యం కలగలేదు అంటూ ఆనం సెటైర్లు...!
X
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి రకరకాలైన ప్రచారాలు సాగుతూనే ఉన్నాయి. ఆయన ఎవరినీ పెద్దగా పట్టించుకోరని, పెద్ద వారు అయినా ఆయనను సార్ అంటూ రెస్పెక్ట్ చేయాలని ఇలా ప్రచారాలు అయితే ఉన్నాయి. దాని మీద వైసీపీ నుంచి అయితే ఎవరూ స్పష్టమైన వివరణలు ఇప్పటిదాకా ఇచ్చినదైతే లేదు దాంతో అవి ప్రచారాలా నిజాలా అన్నది ఎవరికీ తెలియడంలేదు. మాజీ మంత్రి కడప జిల్లాకు చెందిన నేత ఆదినారాయణరెడ్డి సైతం ఓపెన్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో జగన్ మీద చాలా కామెంట్స్ చేశారు. ఆయనను అంతా గౌరవించాలని కోరుకుంటారని, తాను అక్కడ చేతులు కట్టుకుని ఉండలేకనే పార్టీ మారాను అని చెప్పుకొచ్చారు.

ఇపుడు చూస్తే నాలుగేళ్ల పాటు వైసీపీలో ఉంటూ సీనియర్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆనం రామనారాయణరెడ్డి టాక్ ఆఫ్ ది ఏపీ పాలిటిక్స్ అయ్యారు. ఆయనను వైసీపీ అధినాయకత్వం క్రాస్ ఓటింగ్ చేసింది అని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇక ఆనం ఇప్పటికే ఆనేక చానళ్లతో మాట్లాడుతూ జగన్ మీద వైసీపీ మీద ఘాటైన విమర్శలు చాలా చేశారు.

ఈ ఆదివారం ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఎపిసోడ్ ప్రసారం కానుంది. దానికి సంబంధించి వచ్చిన ఒక ప్రొమోలో అనేక సంచలన విషయాలనే ఆనం బయటపెట్టారని తెలుస్తోంది. జగన్ పెద్దలకు గౌరవం ఇవ్వరట. మీకు ఆయనతో ఆలాంటి అనుభవాలను ఉన్నాయా అని అడిగిన దానికి ఆనం మాట్లాడుతూ అంతటి భాగ్యం అయితే తనకు కలగలేదని సెటైరికల్ గా ఆన్సర్ ఇచ్చారు.

తాను జగన్ని వన్ టూ వన్ గా ఎపుడూ కలవలేదని ఆయన చెప్పడం విశేషం. మరి నాలుగేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ముఖ్యమంత్రితో ముఖా ముఖీ ఎపుడూ కలవలేదు అని చెబుతున్నారు అంటే గ్యాప్ మొదటి నుంచి ఉందా అన్న చర్చ వస్తోంది. తాను వ్యక్తిగతంగా కలవలేదు అంటే అపాయింట్మెంట్ ఆనం కోరలేదా లేక జగన్ ఆయనతో మాట్లాడాలని భావించలేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఇదే టాక్ షో లో మాజీ మంత్రి వైఎస్ వివేకా దారుణ హత్య గురించి కూడా ఆనం తనదైన విశ్లేషణ వినిపించడం విశేషం. వివేకా కూతురే హత్యకు కారకులు ఎవరో వేలెత్తి చూపిస్తోందని ఆమె ఒక్క పేరు బయటకు చెప్పడంలేదు కానీ అన్నీ చెప్పేసింది కదా అని ఆనం అన్నారు. అందుకే తాను రాజకీయాల్లోకి వచ్చింది సొంత వారిని హత్య చేసేందుకో అవినీతి కేసులను మాఫీ చేసుకునేందుకో రాలేదని నేరుగానే విమర్శలు చేశాను అని పేర్కొన్నారు.

ఇక సజ్జల రామక్రిష్ణారెడ్డి గురించి కూడా మరో ఆసక్తికరమైన విషయం ఆయన చెప్పడం విశేషం. ఇదే సజ్జల గతంలో తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టో రూపొందించారు కదా అని ఆనం ఒక ప్రశ్నకు బదులిచ్చారు. మరి అది నిజంగా జరిగింద ఏ సందర్భంలో ఆనం అలా మాట్లాడారు, ఆ జవాబుకు ముందూ వెనకా ఉన్న మ్యాటర్ ఏంటి అన్నది మొత్తం ఎపిసోడ్ చూస్తేనే కానీ తెలియదు.

తాను వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన్ స్వేచ్చా జీవిగా మారానని అది ఆనందంగా ఉందని ఆనం చెప్పారు. అదే టైం లో తనను అన్యాయంగా సస్పెండ్ చేశారన్న బాధ ఉందని అన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తన మీద ఏ మచ్చా లేదని అలాంటిది కనీసం తనను ఓటు వేయమని కూడా సంప్రదించకుండా తాను క్రాస్ ఓటింగ్ చేశానని ఎలా అంటారని ఆనం వైసీపీ పెద్దలను ప్రశ్నించారు.

తనకు ఇరవై కోట్లు తెలుగుదేశం వారు ఇచ్చారని సజ్జల ఆరోపించడాన్ని కూడా తప్పు పట్టారు. అయితే తెలంగాణాలో ఒక్కో ఎమ్మెల్యేకు వందల కోట్లు పెట్టి బీజేపీ కొనబోయిందని కేసీయార్ ప్రభుత్వం స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుకుంది కదా ఏపీలో కేవలం పది కోట్లే ఇస్తున్నారా అని ఆర్కే అడిగిన ప్రశ్నకు బీద రాష్ట్రం కదా అదే ఎక్కువని అలా చెప్పి ఉంటారని ఆనం సెటైర్లు వేశారు. మొత్తానికి ఆనం తో ఆర్కే చేసిన ఈ ఇంటర్వ్యూలో అనేక సంచలన విషయాలు జగన్ మీద ఘాటైన విమర్శలు చాలానే ఉన్నాయని అంటున్నారు.