జగన్ చెప్పిన 27 మందిలో కీలక నేతలు.. కిం కర్తవ్యం?

Thu Sep 29 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Among the 27 people mentioned by Jagan who are the key leaders

ఏపీ సీఎం జగన్ తాజాగా తన పార్టీన ఎమ్మెల్యేలు మంత్రులు. మాజీ మంత్రులతో భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితి.. వారిపైనే ఆధార పడి ఉంటుందని అన్నారు. ప్రజల్లో ఉండాలని వారికి పదే పదే సూచించారు. గతంలోనూ తాను ఇలానే చెప్పానని.. అయినా.. కొందరు తన మాటలను లెక్కచేయడం లేదని.. కొంత పరుషంగానే వ్యాఖ్యానించారు. ప్రజల మధ్య ఉండని నాయకులకు టికెట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.  ఇదే విషయాన్ని మరోసారి జగన్ తేల్చి చెప్పారు.``మీరు ఎన్ని చెప్పినా.. నేను వినను. ప్రజల మధ్య ఉండాల్సిందే. వారిలో ఉన్న అసంతృప్తిని తగ్గించాల్సిందే. మీరు ఎంతో బిజీగా ఉన్నారని నాకు కూడా తెలుసు.. అయినా.. మనం ప్రజల మధ్యకువెళ్లాల్సిందే`` అని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలోనే  ఆయన తాను గతంలో చెప్పినన తర్వాత.. కొందరు ప్రజల మధ్య కు వెళ్లారని.. ఇంకా ఇప్పటికీ.. చాలా మంది ప్రజలకు దూరంగానే ఉన్నారంటూ.. 27 మంది ఈ జాబితాలో ఉన్నారని.. చెప్పారు. అయితే.. వీరి పేర్లు చెప్పేందుకు మాత్రం ఆయన తటపటాయించారు.

పేర్లు చెబితే బాగోదని.. ఇన్సల్ట్ చేసినట్టు అవుతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అయితే.. జగన్ అభిప్రాయం మేరకు.. ప్రస్తుతం ఆ 27 మంది ఎవరు? అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న చర్చలను బట్టి.. కొందరి పేర్లపై నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలోనూ ఈయన పేరు బయటకు రావడం గమనార్హం. అయితే.. వాస్తవానికి ఆయన ఎక్కువ కాలం ఢిల్లీలోనే ఉన్నారు. ఉంటున్నారు. దీంతో నియోజకవర్గానికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది.

ఇక జగన్ జాబితాలో ఉన్నారని భావిస్తున్న 27 మందిలో.. మంత్రి పినిపే విశ్వరూప్ మాజీ మంత్రులు.. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆళ్లనాని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసులు  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి(ఈయన ఎంతసేపూ.. సీఎంతోనే ఉంటున్నారు) శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చిర్ల జగ్గిరెడ్డి ధనలక్ష్మి అదీప్‌రాజుల పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లంతా కూడా కీలక నేతలు కావడం గమనార్హం. మరి ఏం చేస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.