Begin typing your search above and press return to search.

మోడీ మన్మోహన్ లలో అర్ధిక దక్షత ఎవరికుంది అంటే...?

By:  Tupaki Desk   |   29 Jan 2023 9:00 PM GMT
మోడీ మన్మోహన్ లలో అర్ధిక దక్షత ఎవరికుంది అంటే...?
X
ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ధిక నిపుణుడు కాదు. ఆయనే స్వయంగా చెప్పుకున్నట్లుగా చాయ్ వాలా నుంచి దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అదే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్ధికవేత్త. ఆయన పదేళ్ల పాటు దేశాన్ని ఏలారు. ఆ టైం లో 2008లో ప్రపంచం ఆర్హ్దిక మాంద్యాన్ని ఎదుర్కొంది. అయినా సరే మన్మోహన్ దేశం పై ఆ క్రీనీడ పడకుండా నడుపుకుని వచ్చారు.

అయితే ఇపుడు అంతకు మించి అన్నట్లుగా ప్రపంచం పరిస్థితి ఉంది. ముఖ్యంగా 2020, 2021, 2022 ఈ మూడు ఆర్ధిక సంవత్సరాలు అత్యంత దారుణంగా ప్రపంచాన్ని నడిపించాయి. ఎన్నో చేదు అనుభవాలను కూడా రుచి చూపించాయి. 2019లో మొదలైన కరోనా మహమ్మారి ఈ రోజు వరకూ తన ప్రతాపం అలా ప్రత్యక్షంగా పరోక్షంగా చూపిస్తూనే ఉంది.

మరో వైపు ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ఏడాదిగా సాగుతోంది. ఈ ప్రభావాలు అన్నీ కలసి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను కుదేల్ చేసి పారేశాయి. ఎక్కడ చూసినా ఉద్యోగాల కోత సర్వ సాధారణం అయిపోయింది. అదే విధంగా బడా కంపెనీలు సైతం కొలువులు మూసుకున్నాయి. ఉన్న వారికి బయటకు సాగనంపుతూ బడ్జెట్ కోత విధించుకుంటున్నాయి. అనేక దేశాలు ఆర్ధిక సంక్షోభాలతో దిక్కులు చూస్తున్నాయి.

అంతరాతీయ పరిస్థితులు అన్నీ ఒక్కసారిగా మారిపోవడంతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ అత్యంత సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది అని చెప్పాల్సి ఉంటుంది. ప్రపంచంలో అగ్రశ్రేణి కంపీను సైతం ఉద్యోగాలను కోత విధించి ఎన్నడూ లేని విధంగా సిబ్బందిని సాగనంపాయి. ఈ పరిణామాల నేపధ్యంలో భారత దేశం కూడా ఆర్ధికంగా సతమతం అయిందనే చెప్పాలి.

ఇదే పరిస్థితులలో  ద్రవ్యోల్బనం చేత  చిక్కి అనేక దేశాలు  విలవిలలాడుతున్నాయి. చాలా దేశాలలో  వస్తువుల ధరలు, ఆహారం ధరలు బాగా పెరిగిపోయాయి. ఆదాయం కన్నా ఖర్చులు అధికమయ్యాయి. నిత్యావసరం అయిన ఇంధనం ధరలు కూడా బాగా పెరిగాయి. ఇక భారత్ లో ఆ ప్రభావం బాగా కనిపించింది. భారత్ దిగుమతుల బిల్లు దారుణంగా పెరిగింది.

కేవలం గడచిన ఒక్క ఏడాదిలో భారత్ లో ఎగుమతుల శాతం 12.2 గా క్షీణత నమోదు అయింది. అలాగే డిసెంబర్‌లో వాణిజ్య లోటు రూ. 1.94 లక్షల కోట్లుగా ఉంది. దీన్ని ఎలా లెక్కిస్తారు అంటే మనం దిగుమతి చేసుకున్న వస్తువులు ఎక్కువ అయి ఎగుమతు చేసేవి తక్కువ కావడం నుంచి అన్న మాట. అలా వాణిజ్యం లోటు బాగా పెరిగిపోయింది అని అంటున్నారు.

ఇలా అన్ని విధాలుగా ఇబ్బందులు ఉన్నా ఆసియా ఖండంలోనే ఈ రోజుకీ భారత్ గట్టిగా నిలబడింది. పక్కన ఉన్న ఇతర దేశాలు ఆకలితో అల్లాడుతూంటే భారత్ మాత్రం స్థిరంగానే ఉంది. దాంతో తాజాగా ఆర్ధిక వ్యవస్థ మోడీ మన్మోహన్ సింగ్ ల ఏలుబడిలో ఎవరి హయాంలో స్థిరంగా బాగా ఉంది అని ప్రముఖ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో మోడీకే జనాలు జై కొట్టారు.

ఏకంగా 51 శాతం మంది మోడీ ఆర్ధిక వ్యవస్థ భేష్ అన్నారు. కేవలం 36 శాతం మంది మాత్రమే మన్మోహన్ సింగ్ కి ఓటేశారు. 13 శాతం ఏమీ చెప్పలేమని అన్నారు. నిజానికి భారత్ లో ఆర్ధిక వ్యవస్థను మోడీ బాగానే హ్యాండిల్ చేశారని అంటున్నారు. ఇక మోడీ రెండవసారి ప్రధాని అయిన తరువాత ప్రవేశపెట్టబోయే చిట్టచివరి పూర్తి స్థాయి బడ్జెట్ మరి కొద్ది రోజులలో ఏమి చెబుతుందో చూడాలి  ఈ రోజు ప్రపంచం అత్యంత సంక్లిష్టపమిన పరిస్థితుల నేపధ్యంలో ఉన్న వేళ మోడీ బడ్జెట్ దేశానికి ఏ రక్మైన దశ దిశ చూపుతోంది అన్నది కూడా చూదాల్సి ఉంది.