Begin typing your search above and press return to search.

అమిత్ షా నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్‌...!

By:  Tupaki Desk   |   12 Nov 2019 1:30 AM GMT
అమిత్ షా నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్‌...!
X
బీజేపీ రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక అంతా ఫ‌టాఫ‌ట్‌... ధ‌నాధ‌న్ అన్న‌ట్టుగా జ‌రుగుతోంది. ట్రిఫుల్ తలాక్ ర‌ద్దు నుంచి బీజేపీ ఎన్నో సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యాల‌తో దేశ ప్ర‌జ‌ల‌కే అంతుబ‌ట్ట‌ని విధంగా దూసుకుపోతోంది. ఇక ఆ వెంట‌నే ఆర్టిక‌ల్ 370 నిబంధ‌న‌తో మ‌రో సంచ‌ల‌నానికి శ్రీకారం చుట్టింది. ఈ ఆప‌రేష‌న్ త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా కొన్ని ద‌శాబ్దాలుగా అత్యంత వివాస్ప‌దంగా ఉన్న అయోధ్య వివాదం కూడా ఓ కొలిక్కి వ‌చ్చేసింది.

అయోధ్య తీర్పు బీజేపీ ఎలా అనుకుందో ఖచ్చితంగా అలాగే వ‌చ్చింది. దీనిని కూడా త‌న అక్కౌంట్‌లో వేసుకున్న బీజేపీ ఈ తీర్పు నేపథ్యంలో గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా ఎలాంటి దుస్సంఘటనలు జరగ కుండా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చూపిన తెగువ, అనుసరించిన వ్యూహంపై సర్వ్రతా అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఈ తీర్పు నేప‌థ్యంలో దేశంలో ఎంతో మంది టెన్ష‌న్ ప‌డ్డారు.

హిందు - ముస్లింలు ఎలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌తారో ?  ఏం జ‌రుగుతుందో ? అని ఉన్న టెన్ష‌న్ అంతా ప‌టాపంచ‌లు అయిపోయింది. అయితే తీర్పు వ‌చ్చిన వెంట‌నే హిందువులు, ముస్లింలు రోడ్ల మీద‌కు వ‌చ్చి అంతా బాయి బాయి అనుకున్నారు. ఎవ‌రో ఒక‌రిద్ద‌రు రాజ‌కీయ నాయ‌కుల మిన‌హా మిగిలిన వాళ్లెవ్వ‌రు ఎలాంటి వివాస్ప‌ద వ్యాఖ్య‌లు కూడా చేయ‌లేదు. ఇక ఇప్పుడు అమిత్ షా నెక్ట్స్ టార్గెట్ కూడా ఫిక్స్ అయిన‌ట్టు క‌మ‌ల‌నాథులు చెప్పుకుంటున్నారు.

బిజెపి తొలి నుంచి చెబుతున్న వాటిలో ఒకటి ఆర్టికల్ 370 రద్దు అయితే.. రెండోది అయోధ్య రామమందిరం. ఈ రెండూ ఫినిష్ అయ్యాయి. ఇక మూడోది దేశ‌వ్యాప్తంగా ఉమ్మ‌డి సివిల్ కోడ్‌ను అమ‌లు చేయ‌డం.. ఇది అత్యంత స‌వాల్‌తో కూడుకుని ఉంది. అయోధ్య లాంటి అత్యంత కీల‌క అంశం క‌న్నా కూడా సివిల్ కోడ్ టాస్క్ చాలా క‌ష్ట‌మైందిగా రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

కామ‌న్ సివిల్ కోడ్ విష‌యంలో ఉన్న లొసుగుల నేప‌థ్యంలో ఏకాభిప్రాయం రావ‌డం క‌ష్టంగానే క‌నిపిస్తోంది. మ‌రి ఈ విష‌యంలో ఎన్డీయే స‌ర్కార్ ఎలా ముందుకు వెళుతుందో ?  అమిత్ షా ఈ టాస్క్‌ను ఎలా ఫినిష్ చేస్తాడో ?  చూడ‌డ‌మే మిగిలి ఉంది.