Begin typing your search above and press return to search.

ట్రంప్ కు పోటీగా ప్రముఖ ర్యాపర్: అధ్యక్ష బరిలో కెన్యా వెస్ట్

By:  Tupaki Desk   |   5 July 2020 1:57 PM GMT
ట్రంప్ కు పోటీగా ప్రముఖ ర్యాపర్: అధ్యక్ష బరిలో కెన్యా వెస్ట్
X
ప్రస్తుతం అమెరికాలో వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నా ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ దేశంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. వైరస్ ఏ స్థాయిలో ఉన్నా ఎన్నికల నిర్వహణకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకే వెళ్తున్నాడు. ఈ సందర్భంగా ఆ దేశంలో ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఈ క్రమంలో మరోసారి అధ్యక్షుడిగా ట్రంప్ బరిలో దిగుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ట్రంప్ కు పోటీగా ఓ ప్రముఖ ర్యాపర్ బరిలో దిగుతున్నాడు.

అమెరికా అధ్యక్ష రేసు కొత్త మలుపు తిరిగింది. తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున పోటీ చేస్తున్నట్లు ప్రముఖ ర్యాపర్ కెన్యా వెస్ట్ ప్రకటించాడు. ఇతడికి టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ ముస్క్ తన మద్దతు తెలుపుతున్నాడు. అతడి అండతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఎన్నికలపై చర్చ మొదలైంది.

నేను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా కెన్యా వెస్ట్ ప్రకటించాడు. దేవుడిపై నమ్మకం ఉంచే అమెరికన్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి ఉందని తెలిపాడు. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలి అంటూ అమెరికా ప్రజలకు పిలుపునిచ్చాడు. కెన్యా వెస్ట్ గతంలో డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగితే మద్దతు పలికారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక తన భార్య కిమ్ కర్దాషియన్ తో కలిసి వైట్ హౌస్ ను కూడా సందర్శించారు. గతాన్ని గుర్తు చేసుకుని ఇప్పుడు ఎందుకు అతడు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నాడో తెలియడం లేదు. అయితే కొందరు ట్రంప్ గెలుపు కోసం అతడు పరోక్షంగా బరిలో దిగుతున్నట్టు భావిస్తున్నారు.

ఏది ఏమున్నా నవంబర్ 3వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎవరు గెలుస్తారనేది అమెరికన్లతో పాటు అన్ని దేశాల్లో ఉత్కంఠ ఏర్పడింది.