Begin typing your search above and press return to search.

చైనా యాప్స్ నిషేధం : భారత్ నిర్ణయాన్ని స్వాగతించిన అమెరికా!

By:  Tupaki Desk   |   2 July 2020 8:30 AM GMT
చైనా యాప్స్ నిషేధం : భారత్ నిర్ణయాన్ని స్వాగతించిన అమెరికా!
X
చైనాకు సంబంధించిన యాప్‌ లను నిషేధించాలని భారతదేశం తీసుకున్న నిర్ణయం అభినందించదగ్గదని అగ్రరాజ్యం అమెరికా పేర్కొంది. ఈ మేరకు యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో బుధవారం ఓ ప్రకటన చేశారు. చైనాకు చెందిన కొన్ని మొబైల్ యాప్స్ ‌ను బ్యాన్ చేయాలన్న భారత నిర్ణయం అభినందనీయమని పాంపియో చెప్పారు. ఈ నిర్ణయం భారత సమగ్రత, జాతీయ భద్రతకు ఉపకరిస్తుందని, చైనా యాప్‌ లను భారత్‌ నిషేధించడాన్ని తాము స్వాగతిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో బుధవారం పేర్కొన్నారు.

ఇలా చేయడం భారత సార్వభౌమాధికారిన్ని పెంచుతుందని తెలిపారు. ‘యాప్స్‌ను జల్లెడ పట్టాలన్న భారత నిర్ణయం చాలా మంచిది. దీనివల్ల భారత సార్వభౌమాధికారం, జాతీయ భద్రతలో గొప్ప మార్పులొస్తాయి’ అని పాంపియో అభిప్రాయపడ్డారు. చైనాకు చెందిన టిక్ టాక్, షేర్ ఇంట్, యూసీ బ్రౌజర్, విమేట్, లైక్, హెలో వంటి మొత్తం 59 యాప్స్ ను భారత్ ఇటీవలే బ్యాన్ చేసింది. దాంతో వెంటనే ఈ నిషేధం అమలులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ యాప్స్ భారత దేశ వినియోగదాలుకు అందుబాటులో లేవు. వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి అంటూ ప్రభుత్వం ఇప్పటికే సర్వీస్ ప్రొవడైకర్లక సూచనలు జారీ చేసింది. జాతి భద్రతకు విఘాతం కలిగించే యాప్స్ ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 లోని 69 ఏ ప్రకారం వీటిని బ్యాన్ చేసింది

మరోవైపు చైనా యాప్ ‌లను భారత్‌ నిషేధించిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చైనా సోషల్‌ మీడియా బ్లాగింగ్‌ సైట్‌ వీబో నుంచి వైదొలిగారు. చైనా యాప్‌ లను భారత ప్రభుత్వం నిషేధించడంపై భారత్ ‌లో చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి జి రోంగ్‌ స్పందించారు. ఈ వ్యవహారంపై తమ దేశం తీవ్రంగా కలత చెందుతోందని, ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు.