Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ జోరుతో అమెరికా కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

By:  Tupaki Desk   |   5 Dec 2021 5:30 PM GMT
ఒమిక్రాన్ జోరుతో అమెరికా కీల‌క ప్ర‌క‌ట‌న‌..!
X
ప్ర‌పంచ దేశాల‌ను క‌రోనా వైర‌స్ అనేది గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా వ‌ణికించేస్తోంది. క‌రోనా వ‌చ్చాక మాన‌వ జీవితంలో వేగానికి చాలా వ‌ర‌కు క‌ళ్లెం ప‌డిపోయింది. దూకుడుగా ముందుకు వెళ్లే ఈ జీవితానికి పెద్ద బ్రేకులు ప‌డ్డాయి. క‌రోనా క‌ల్లోలం నుంచి ప్ర‌పంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న వేళ ఇప్పుడు మ‌రో కొత్త క‌రోనా వేరియంట్ మాన‌వాళిపై విరుచుకు ప‌డుతోంది. ఒమిక్రాన్ దెబ్బ‌తో ఇప్పుడు ప్ర‌పంచ దేశాలు అల్ల‌క‌ల్లోలం అవుతున్నాయి. స్లోగా స్టార్ట్ అయిన ఒమిక్రాన్ ఇప్పుడు ప్ర‌పంచం అంత‌టా శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. ఇక ఆఫ్రికాలో స్టార్ట్ అయిన ఈ కొత్త వేరియంట్ ఇప్పుడు యూర‌ప్‌తో పాటు అగ్ర రాజ్యం అమెరికాను కూడా గ‌డ‌గ‌డ లాడిస్తోంది. త‌మ దేశంలో ఈ వేరియంట్ చాప‌కింద నీరులా విస్త‌రిస్తుండ‌డంతో అమెరికా ఎలెర్ట్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే ఓ కీల‌క ప్ర‌క‌ట‌న కూడా చేసింది.

భార‌త్‌తో పాటు ఆసియా దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికులు కోవిడ్ నెగిటివ్ రిపోర్టుతో మాత్ర‌మే అక్క‌డ‌కు రావాల్సి ఉంటుంది. ఈ రిపోర్టు ఉంటేనే అమెరికాలో అనుమ‌తి ఉంటుంది. లేదా గ‌త 90 రోజుల్లో కోవిడ్ భారీన ప‌డి కోలుకున్న‌ట్టు అయినా ఆధారాలు ఉండాలి. ఈ కొత్త నిబంధ‌న‌లు డిసెంబ‌ర్ 6 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమ‌న్ స‌ర్వీసెస్ లోని సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ వెల్ల‌డించింది. ఇందుకోసం కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా రూపొందించింది.

రెండేళ్లు అంత‌కు పై బ‌డి వ‌య‌స్సు ఉన్న వారికి ఈ నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి. ఇక క‌రోనా నెగిటివ్ రిపోర్టు కూడా ప్ర‌యాణానికి ఒక రోజు ముందు చేయించుకున్న‌ది అయ్యింది మాత్ర‌మే అయ్యి ఉండాలి. ఇక ప్ర‌యాణికులు కూడా అక్క‌డ స‌మ‌ర్పించే వివ‌రాలు అన్ని క‌రెక్టుగా మ్యాచ్ అయ్యి ఉండాలి. వీటిల్లో ఏ ఒక్క‌టి త‌ప్పుగా ఉన్నా కూడా వారిని ఎయిర్‌పోర్టులో దిగేందుకు అనుమ‌తించ‌రు.

ఇక అమెరికాలోని ఒమిక్రాన్ కేసులు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఒక్క న్యూయార్క్‌లోనే 8 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. ఇక మ‌సాచుసెట్స్ - వాషింగ్ట‌న్ - న్యూజెర్సీ రాష్ట్రాల్లో కూడా కొత్త ఒమిక్రాన్ కేసులు న‌మోదు అవుతున్నాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌ల్లోలం రేగుతుండ‌డంతో అమెరికా ఈ నిర్ణ‌యం తీసుకుంది. సో భార‌త్ నుంచి అమెరికా వెళ్లే ప్ర‌యాణికులు అంద‌రూ ఈ నిబంధ‌న‌లు పాటించాల్సి ఉంది. అందుకు త‌గిన‌ట్టుగా ముందు సంసిద్ధులు కావాలి.