అమెరికా ఆంక్షలు లెక్కచేయని నియంత

Sun Jan 16 2022 15:48:13 GMT+0530 (India Standard Time)

America is a dictator who does not care about sanctions

అగ్రరాజ్యం అమెరికా కంట్లో ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ నలుసులా తయారయ్యారు. అణ్వాయుధాల తయారీ ప్రయోగాల విషయంలో అమెరికా ఎన్ని ఆంక్షలను విధిస్తున్నా కిమ్ ఏమాత్రం లెక్క చేయటంలేదు. పైగా నువ్వెంతంటే నువ్వెంతంటు అమెరికాతోనే యుద్ధానికి కాలు దువ్వుతున్నారు. దాంతో కిమ్ ను ఎలా కంట్రోల్ చేయాలో అర్ధంకాక అమెరికా తల పట్టుకుంటోంది.



ఇప్పుడిదంతా ఎందుకంటే తాజాగా బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించింది. నెల రోజుల వ్యవధిలో ఉత్తరకొరియా చేసిన మూడో ప్రయోగమిది. అణ్వాయుధ పరీక్షలు ప్రయోగాల విషయంలో తాము అమెరికా ఆంక్షలకు బెదిరేదే లేదని తెలియజేయడం కోసమే కిమ్ ఇలాంటి ప్రయోగాలను వరసబెట్టి చేస్తున్నారు. అమెరికా ఆంక్షలకు బెదిరేది లేదని ఎందులోను తగ్గేదే లేదని స్పష్టంగా చెప్పేశారు.

రెండు మిస్సైల్స్ ను ఉత్తరకొరియా సముద్రంలోకి ప్రయోగించిందని దక్షిణ కొరియా ప్రపంచానికి చెప్పిన మరుసటి రోజే ఉత్తర కొరియా మూడో ప్రయోగం చేయటంతో అమెరికా ఉలిక్కిపడింది. ఉత్తర కొరియాను నేరుగా ఏమీ చేయలేని అమెరికా ఆ దేశానికి మిస్సైల్ సాంకేతికతను అందిస్తున్న ఐదు సంస్ధలపై బ్యాన్ విధించింది. ఐక్యారాజ్యసమితిపై ఒత్తిడి తెచ్చి ఉత్తర కొరియాపై తీవ్రమైన ఆంక్షలు విధించేందుకు ప్రయత్నించబోతున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది.

అయితే అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత ఒత్తిడి పెట్టినా తాము మాత్రం వెనక్కు తగ్గేది లేదంటు కిమ్ కుండబద్దలు కొట్టకుండానే ప్రకటించేశారు. ఉత్తరకొరియాకు అతిపెద్ద మద్దతుదారు చైనాయే అన్న విషయం యావత్ ప్రపంచానికంతా తెలుసు. చైనాను అమెరికా ఏమీ చేయలేందు. ఎందుకంటే సాంకేతికతలో మిలిట్రీ వ్యవస్థలో రెండు దేశాలు దాదాపు సమానమే. పైగా అనేక అంశాల్లో  అమెరికా మీద చైనా ఆధారపడటం కన్నా చైనా మీదే అమెరికా ఆధారపడుంది. కాబట్టి చైనా హ్యాపీగా ఉన్నంత కాలం ఉత్తరకొరియా కూడా హ్యపీయే.