Begin typing your search above and press return to search.

టిక్ టాక్ : భారత్ బాటలో అమెరికా!

By:  Tupaki Desk   |   24 July 2020 2:30 AM GMT
టిక్ టాక్ : భారత్ బాటలో అమెరికా!
X
గాల్వానా ఘటన తరువాత చైనాకి షాక్ ఇస్తూ ఇండియా చైనా కి చెందిన టిక్ టాక్ సహా 59 చైనీస్ యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే , భారత్ నిర్ణయంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయగా.. అమెరికా మాత్రం ప్రశంసలు కురిపించింది. ఇప్పటికే భారత్ నిర్ణయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పోపియో పాంపియో సమర్థించారు. ఈ నేపథ్యంలో అమెరికాలోనూ టిక్ టాక్‌ను బ్యాన్ చేయాలన్న డిమాండ్ బలంపుంజుకుంటోంది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని టిక్ టాక్ సహా పలు చైనా యాప్స్‌ను బ్యాన్ చేస్తూ భారత్ ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుందని అమెరికా కాంగ్రెస్ సభ్యులు అభినందించారు. దేశ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని అమెరికాలో టిక్ టాక్ ‌ను అమెరికాలో కూడా బ్యాన్ చేయాలని కోరుతూ 25 మంది కాంగ్రెస్ సభ్యులు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌ కు లేఖ కూడా రాశారు.

అమెరికాలో తాజా పరిస్థితులని గమనిస్తే .. టిక్ టాక్ ని అమెరికాలో దాదాపు నిషేధించినట్టే అని చెప్పాలి. ఫెడరల్ ఉద్యోగులు తమ ఫోన్లు, ఇతర సాధనాల్లో ఈ యాప్ ని వినియోగించకుండా బ్యాన్ చేసేందుకు ఉద్దేశించిన బిల్లును బుధవారం యుఎస్ సెనేట్ కమిటీ ఆమోదించింది. యూజర్ల పర్సనల్ డేటా చైనా చేతుల్లోకి వెళ్లిపోతుందన్న భయంతో దీనికి గుడ్ బై చెప్పారు. నో టిక్ టాక్ ఆన్ గవర్నమెంట్ డివైజెస్ యాక్ట్ అన్న పేరిట జోష్ హాలే అనే సెనెటర్ ప్రవేశపెట్టిన బిల్లును ఈ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

యూఎస్ సెనేట్ లో దీనిపై ఓటింగ్ జరగనుంది. అమెరికా లో ముఖ్యంగా 16 నుంచి 24 ఏళ్ళ మధ్యవయసున్న యువత ఎక్కువగా టిక్ టాక్ ని ఎంజాయ్ చేస్తున్నారు. దేశ జనాభాలో వీరు 60 శాతం వరకు ఉన్నారు. ఫెడరల్ సిబ్బంది ఈ యాప్ వాడరాదని ఇటీవలే ప్రతినిధుల సభ బిల్లును ప్రవేశపెట్టగా 336 మంది అనుకూలంగాను, 71 మంది వ్యతిరేకంగాను ఓటు చేశారు. దీనితో త్వరలోనే ఇది చట్టం కావచ్చు.