Begin typing your search above and press return to search.

ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. 45 బ్యాగుల్లో బాడీ పార్ట్స్!

By:  Tupaki Desk   |   3 Jun 2023 7:00 AM GMT
ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. 45 బ్యాగుల్లో బాడీ పార్ట్స్!
X
థ్రిల్లర్ ఇన్విస్టిగేషన్ సినిమాల్లో కూడా కనిపించని దారుణమైన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర అమెరికాలోని మెక్సికోలో అతి భయంకరమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది.

వరుసగా నమోదవుతున్న మిస్సింగ్ కేసుల నేపథ్యంలో... కనిపించకుండా పోయిన యువతీయువకుల గురించి విచారణ జరుపుతోన్న సమయంలో… ఈ దారుణం వెలుగుచూసింది. దీంతో... దాదాపు 45 బ్యాగుల్లో మానవ శరీర భాగాలను పోలీసులు గుర్తించారు.

వివరాళ్లో కి వెళ్తే... జాలిస్కో రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పార్కు సమీపంలోని ఓ లోయల్ 45 బ్యాగులు బయట పడ్డాయి. అందులో మానవ శరీర భాగాలు ఉండటంతో పోలీసులు, అధికారులు షాక్‌ కు గురయ్యారు.

అవి స్త్రీ, పురుషుల శరీర భాగాలని స్టేట్ ప్రాసిక్యూట్ ఆఫీస్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఓ కాల్ సెంటర్‌ లో పనిచేసే 30 ఏళ్ల వయసున్న ఏడుగురు యువతీయువకులు వరుసగా కనిపించకపోవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసు విచారణలో భాగంగా గాలింపు చేపట్టిన పోలీసులకు ఇలా శరీర భాగాలు ఉన్న బ్యాగులు కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. వీరిలో ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే దొరికిన శరీర భాగాలు ఎంత మందివి, ఎవరివి అనేది మాత్రం ఫోరెన్సిక్ నిపుణులు ధ్రువీకరించాల్సి ఉంది.

ఆ యువతీ యువకులు పనిచేస్తున్న కాల్‌ సెంటర్‌ కు సమీపంలోనే ఉన్న పారిశ్రామిక ప్రాంతంలో ఈ బ్యాగ్ లు లభించడంతో ఆ కాల్‌ సెంటర్‌ పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారణం... అక్కడ చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గతంలోనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు డ్రగ్స్, రక్తపు మరకలతో ఉన్న వస్తువులు, కొన్ని సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకున్నారు.

అయితే జాలిస్కో రాష్ట్రంలో ఇలా బ్యాగుల్లో మానవశరీర భాగాలను గుర్తించడం ఇదే మొదటిసారి కాదు. 2019లో 29 వ్యక్తులకు చెందిన 119 బ్యాగులను అప్పట్లో గుర్తించగా... 2021లో సుమారు 70 బ్యాగుల్లో అవశేషాలు బయటపడ్డాయి.

అవి 11 మంది వ్యక్తులవని అప్పుడు వెల్లడైంది. ఇలా అక్కడ వేల సంఖ్యలో మిస్సింగ్ కేసులు నమోదవ్వుతుండటం రొటీన్ గా మారిపోయింది. అయితే ఈ పరిస్థితికి అక్కడి డ్రగ్స్ మాఫియానే కారణం అని తెలుస్తుంది!