Begin typing your search above and press return to search.

పవన్ కల్యాణ్ గెలవడు కానీ...అంబటి రాయుడు గెలుస్తాడా...?

By:  Tupaki Desk   |   7 Jun 2023 6:00 PM GMT
పవన్ కల్యాణ్ గెలవడు కానీ...అంబటి రాయుడు గెలుస్తాడా...?
X
రాజకీయాల్లో గెలుపు ఓటములు అన్నవి ఎవరూ చెప్పలేరు. కానీ అభిమానం పెట్టుబడిగా ఉన్న వారికి మాత్రం రాజకీయాల్లో అది అతి పెద్ద పెన్నిధిగా ఉంటుంది. అలా కనుక చూసుకుంటే సినీ హీరోలకు రాజకీయాలు చాలా వరకూ ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

సినిమా హీరోలను నటీనటులను ప్రజలు వెండి తెర వేలుపులుగా చూస్తారు. వారిని తమ సొంత వారిగా అభిమానిస్తారు. అలాంటి చోట వారికి పార్టీ తో ఆ పార్టీ ద్వారా వచ్చే ఓటు బ్యాంక్ తో సంబంధం లేకుండా సొంతంగానే ఇమేజ్ ఉంటుంది కాబట్టి ఓట్లు ఎక్కువగా వస్తాయి. గెలుపు గ్యారంటీ అని అంటారు.

ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే చాలా మంది సినీ నటులు గెలిచారు. చాలా మంది రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇంకా రావాల్సిన అవసరం కూడా ఉంది. ఇక ఏపీలో చూసుకుంటే మెగాభిమానులు ఎక్కువ. అలా రాజకీయ రంగ ప్రవేశం చేసిన మెగాస్టార్ చిరంజీవి సొంతంగా ప్రజారాజ్యం పార్టీని పెట్టి రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట గెలిచారు. మరో చోట ఓడారు.

మరోవైపు చూస్తే జనసేన పార్టీని 2014లో పెట్టి 2019 ఎన్నికల్లో రెండు సీట్లలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారు. ఇపుడు 2024 ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పవన్ పార్టీ పొత్తులతో రావాలని చూస్తోంది. ఆయన ఏ ఎత్తులతో వచ్చినా గెలవరు అని వైసీపీ నేతలు కానీ ఇతర నాయకులు కానీ అంటూంటారు.

ఇపుడు భారతీయ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ప్రస్థావన జోరుగా వస్తోంది. ఈ యువ క్రికెటర్ తన క్రికెట్ జీవితానికి రిటైర్మెంట్ ఇచ్చేసి రాజకీయాల్లోకి వస్తున్నారు అని ప్రచారం జోరుగా సాగుతోంది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి చెందిన అంబటి తిరుపతి రాయుడు రాజకీయాల్లోకి రావడం ఏంటి ఎంపీగా గెలిచి తీరుతారు అని అంతా అంటున్నారు.

ప్రజలలో ఎక్కువగా అభిమానం ఉన్నది సినీ క్రికెట్ స్టార్స్ కే. అందునా సినిమా వారి మీద ఇంకా ఎక్కువ అభిమానం ఉంటుంది. వారు జన సామాన్యానికి పూర్తిగా తెలుస్తారు. అదే క్రికెట్ అయితే కేవలం యూత్ కే ఎక్కువగా కనెక్ట్ అవుతారు. మరి అంబటి తిరుపతి రాయుడు విషయం తీసుకుంటే ఆయన కచ్చితంగా గెలుస్తారు అని చెబుతున్న వారు సినిమాల్లో ఈ రోజుకీ పవర్ స్టార్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గెలవరు అని ఎలా అనగలుగుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ లాంటి వారే గెలవని చోట అంబటి తిరుపతి రాయుడు ఎలా గెలుస్తారు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఆయన ఇలా వచ్చి అలా ఏదో ఒక పార్టీ జెండాను తన ముందు పెట్టుకుని జనం వద్దకు వస్తే అంత సులువుగా గెలిపించేస్తార అన్న చర్చ కూడా వస్తోంది. అది కూడా ఆయన్ని చూసి ఏకంగా ఎంపీగా గెలిపిస్తారా అన్నదే ఇపుడు ఒక హాట్ డిబేట్ గా సాగుతోంది.

పవన్ కళ్యాణ్ లాంటి వారిలో లేనిది ఏంటి, అంబటి తిరుపతి రాయుడులో ఉన్నదేంటి అన్న చర్చ కూడా సాగుతోంది. రాజకీయాల్లో ఉండాలీ గెలవాలీ అంటే అయిదేళ్ళూ ప్రజలతో కలసి పనిచేయాలని వారి మెప్పు పొందాలని సుద్దులు చెప్పే వారు అంతా అంబటి రాయుడు విషయంలో మాత్రం ఆ రూల్స్ వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు.

రాజకీయాలు పార్ట్ టైం కాదని సలహాలు ఒక వైపు ఇస్తూ ఎన్నికల వేళకు అలా పై నుంచి దిగిపోయిన అంబటి వంటి క్రికెటర్లు ఎలా గెలుస్తారు అని చెప్పగలుస్తున్నారు బాస్ అని కూడా నిలదీస్తున్నారు. మరో వైపు చూస్తే అంబటి రాయుడు విషయం లో ఆయన స్థానిక జనాలకు ఎంత వరకు టచ్ లో ఉన్నాడో కూడా తెలియదు. ఆయన సొంత జిల్లా గుంటూరు అయినా స్థిరపడిపోయింది అంతా హైదరాబాద్ లోనే అని అంటున్నారు.

మరి అలాంటిది ఆయనకే ఓటు వేసి గెలిపించేస్తే పవన్ కళ్యాణ్ ని కూడా ఎపుడో గెలిపించేసేవారు కదా అని అంటున్నారు ప్రజలు రాజకీయాలను వేరేగా చూస్తారని సినీ అభిమానం వేరు అని చెబుతున్న వారు ఇపుడు క్రికెట్ అభిమానం వేరు అని ఎందుకు అనడం లేదు అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఏది ఏమైనా అంబటి రాయుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు అని టాక్ నడుస్తూంటే ఆయనకు టికెట్ ఇచ్చేందుకు వైసీపీ టీడీపీ బీయారెస్ సహా అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే అంబటి రాయుడు అంటే అంత నమ్మకమా అని సెటైర్లు అప్డుతున్నాయి. చూడాలి మరి ఏపీ లో సినీ అభిమానం కంటే క్రికెట్ అభిమానం ఎక్కువా ఏమిటి అన్నది అంటున్నారు.