Begin typing your search above and press return to search.

ఆ దేవుడు కూడా క్షమించడు.. అంబటి గట్టిగానే తోటి ఎమ్మెల్యే అన్నా రాంబాబు కు సుద్దులు!

By:  Tupaki Desk   |   29 March 2023 5:20 PM GMT
ఆ దేవుడు కూడా క్షమించడు.. అంబటి గట్టిగానే తోటి ఎమ్మెల్యే అన్నా రాంబాబు కు సుద్దులు!
X
అన్నా రాంబాబు ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే. ఆయన తాజాగా తిరుమల వచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మీద ఘాటైన కామెంట్స్ చేశారు. టీటీడీలో ఎమ్మెల్యేలకు ఏ మాత్రం విలువ లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని చాలా పెద్ద మాటలే మాట్లడారు.

ఈవో ధర్మారెడ్డికి ఒక ఉద్యోగి మాత్రమే అని తేలిక చేశారు. తయన సొత్తు టీటీడీ కాదని అన్నారు. ఈ విషయం మీద ముఖ్యమంత్రి జగన్ కి ఫిర్యాదు చేస్తామని కూడా హెచ్చరించారు. అన్నా రాంబాబు ఆరోపణల మీద టీటీడీ వెంటనే రెస్పాండ్ అయి అసలు గుట్టు విప్పింది. మొత్తం 28 మంది అన్నా రాంబాబు అనుచరులకు రెండు రోజుల పాటు ప్రోటోకాల్ ప్రకారం దర్శనం చేయించామని చెప్పుకొచ్చింది.

ఆ మీదట అన్నా రాంబాబు నుంచి కౌంటర్ లేదు. అంటే అదే నిజం అనుకోవాలేమో. ఇదిలా ఉండగా అన్నా రాంబాబు కామెంట్స్ మీద మంత్రి అంబటి రాంబాబు రెస్పాండ్ అయ్యారు. ఆయన ఈ రోజు వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన అంబటి రాంబాబు అన్నా రాంబాబు టీటీడీ మీద చేసిన విమర్శలు తగవని అడ్డంగా ఖండించేశారు.

టీటీడీలో అంతా పద్ధతిగా సాగుతోందని అన్నారు. అదనపు దర్శన టికెట్లు కావాలని అడిగితే టీటీడీ వారు ఇస్తారని ఆయన చెప్పుకొచ్చారు. తాను విపక్షంలో ఉన్నపుడు కూడా తన ప్రోటోకాల్ ప్రకారం తనకు ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చారని అన్నారు. అన్నా రాంబాబు టీటీడీపీ మీద అలా మాట్లాడడం వంద శాతం తప్పు అని మంత్రి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం విశేషం.

అసలు అన్నా రాంబాబు అలా ఎందుకు మాట్లాడారో అర్ధం కావడం లేదని అంబటి అన్నారు. అలా మాట్లాడి తప్పు చేశారని, అది చాలా పొరపాటుగా తాను భావిస్తున్నాను అన్నారు. దైవ సన్నిధానంలో రాజకీయాల మీద మాట్లాడడమే తప్పు అన్నారు. దేవుడి సన్నిధానంలో అందరూ ఒక్కటే అన్నారు. అధికారులు కూడా స్వపక్షంగా విపక్షమా అన్న తేడా చూపకుండా బాగా చూసుకుంటారని అన్నారు.

ఇప్పటిదాకా ఎవరూ ఇలాంటి ఆరోపణలు చేయలేదని అంబటి గుర్తి చేశారు ఇలా దైవం వద్దకు వస్తూ రాజకీయంగా విమర్శలు చేయాలని చూస్తే మాత్రం ఆ దేవుడు కూడా క్షమించడు అని అంబటి గట్టిగానే తోటి ఎమ్మెల్యేకు సుద్దులు చెప్పారు. మొత్తానికి చూస్తే అన్నా రాబాబు కొంతకాలంగా తన వ్యవహార శైలితో అనుమానంస్పందంగానే ఉంటున్నారు అని అంటున్నారు.

ఏదో సాకు చూపించి ఇండైరెక్ట్ గా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చాలా మంది చూస్తున్నట్లుగా ఆయన ఈ రకంగా కామెంట్స్ చేశారా అన్న చర్చ నడచింది. టీటీడీ అధికారుల వివరణతో అన్నా రాంబాబు చేసిన ఆరోపణలు తప్పు అని తేలింది. ఇపుడు అంబటి రాంబాబు తప్పున్నర ఇది అనడం ద్వారా అన్నాను కౌంటర్ చేశారని అంటున్నారు. అంబటి రాంబాబు జగన్ కి గట్టి మద్దతుదారు అన్నది తెలిసిందే. మరి దీని మీద అన్నా రాంబాబు ఏమంటారో చూడాల్సి ఉంది.