Begin typing your search above and press return to search.

అమెజాన్ అధిపతి మరో అపూర్వ రికార్డ్

By:  Tupaki Desk   |   27 Aug 2020 10:50 AM GMT
అమెజాన్ అధిపతి మరో అపూర్వ రికార్డ్
X
ప్రపంచంలోనే తొలి 200 బిలియన్ డాలర్ల సంపదతో ఒకే ఒక అపర కుబేరుడిగా అవతరించాడు అమెజాన్ అధిపతి జెఫ్ బోజెస్. కరోనా లాక్ డౌన్ తో దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలై.. అందరి ఉద్యోగాలు పోయి రోడ్డున పడుతుంటే జెఫ్ బోజెస్ మాత్రం ఏకంగా సంపద పోగేసుకోవడం..ప్రపంచంలోనే ఎవ్వరికి అందనంత సంపదతో తొలిస్థానంలో నిలవడం విశేషంగా మారింది.

ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెరికా ఆదాయం బుధవారం 2.85 శాతం పెరిగిన తర్వాత అమెజాన్ వ్యవస్థాపకుడు.. సిఇఒ జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే మొదటి 200 బిలియన్ డాలర్ల సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా అవతరించారు. బెజోస్ అమెజాన్ లో 54.5 మిలియన్ షేర్లను కలిగి ఉన్నాడు. ఇది 10.9 శాతం వాటాతో సమానం. ప్రస్తుతం బెజోస్ మొత్తం నికర విలువ 4204.6 బిలియన్లు.

వ్యాపారాలు ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్న ఈ క్లిష్ట సమయంలో.. అనేక దేశాల జిడిపిలు ప్రతికూలంగా మారినవేళ జెఫ్ బెజోస్ అమెజాన్ భారీగా ఆదాయాన్ని ఆర్జించడం విశేషం. ప్రజలు బయటకు వెళ్లి వైరస్ బారిన పడకుండా ఆన్‌లైన్‌లో కొనడానికి ఇష్టపడతున్నారు. ఇదే అమెజాన్ లాభాల బాట పట్టడానికి కారణంగా తెలుస్తోంది. సీటెల్ ఆధారిత సంస్థ అయిన అమెజాన్ విలువ ఇప్పుడు 721.72 ట్రిలియన్లుగా ఉంది.

తన జీవిత భాగస్వామి భార్య మాకెంజీ స్కాట్‌తో అత్యంత ఖరీదైన విడాకుల పరిష్కారంతో ఆమెకు డబ్బులు చెల్లించకపోతే బెజోస్ మరింత ధనవంతుడుగా ఉండేవాడు. తన భార్య మాకెంజీకి అమెజాన్ వాటాలో 25 శాతం ఇచ్చాడు. అది ఇప్పుడు 63 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది జరగకపోతే బెజోస్ 250 బిలియన్ డాలర్ల క్లబ్‌లో ఉండేవాడు. కానీ 200 బిలియన్ డాలర్లకే పరిమితమైపోయాడు.

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరియు ఫేస్బుక్ సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్ లు బెజోస్ తర్వాత ప్రపంచంలో బిలియనీర్లుగా ఉన్నారు.