పవన్ కళ్యాణ్.. మేము ఏదో ఊహించాం.. తుస్సుమనిపించావ్.!

Mon Aug 03 2020 17:04:48 GMT+0530 (IST)

Amaravathi Farmers Fires On Pawan Kalyan

మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందిన వేళ టీడీపీ నుంచి కాస్త గట్టిగానే ప్రతిఘటన వచ్చింది. చంద్రబాబు నానీ యాగీ చేసేసి ముసలికన్నీరు కార్చేస్తూ మీడియాలో తన ఆవేదనంతా వెళ్లగక్కేసి అమరావతి ఉద్యమకారులను సంతృప్తి పరిచాడు. అమరావతి తరుఫున పోరాడుతానని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు కూడా చేస్తారని వార్తలు వచ్చినా అదంతా తూచ్ అని తేలింది.అయితే అందరి చూపు పవన్ కళ్యాణ్ మీదే ఉండేది. పవన్ కళ్యాణ్ అమరావతి ఉద్యమం చేస్తాడని ఆ ప్రాంత బాధిత రైతులంతా ఆశించారు. నిన్న ‘జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ’ కూర్చొని అమరావతిపై తీవ్రంగా పవన్ సహా జనసేన నేతలంతా చర్చించారు. పవన్ అమరావతి ఉద్యమంలోకి వస్తాడేమోనని ఉద్యమకారులు అనుకున్నారు.

కానీ మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ మాత్రం సింపుల్ గా వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయండని.. రాజకీయంగా అర్థం పర్థం లేని మాట్లాడి దులుపుకున్నాడు. నిజానికి పవన్ కళ్యాణ్ అమరావతి విషయంలో ఏం చేస్తాడని ఆ ప్రాంత రైతులు ఆశించారు. కానీ తానేమీ చేస్తానో చెప్పకుండా గెలిచి సంవత్సరమే అయిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయండని పిలుపునివ్వడంపై అందరూ ముక్కున వేలేసుకున్నారని అమరావతిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పదవులు పట్టుకొని వేలాడుతున్న ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనామా చేయడానికి ముందుకు రారు. ఈ క్రమంలోనే అసలు ఉద్యమంలోకి వస్తాడా రాడా అనేది క్లారిటీ ఇవ్వండి పవన్ గారు అని అమరావతి ఉద్యమకారులు సూటిగా అడుగుతున్నారు.?

పవన్ మాటలను బట్టి ఏంతో ఊహించిన ఉద్యమకారులు ఇప్పుడు ‘తుస్సుమనిపించావ్’ అని ఊసురుమన్నారు. అమరావతిపై పవన్ కళ్యాణ్ ఇలా నీరుగారుస్తాడని ఎవ్వరూ ఊహించలేదని అంటున్నారు. పవన్ స్పందనను ఇప్పటికీ అమరావతి జనాలు జీర్ణించుకోవడం లేదట..