తెలంగాణ బడ్జెట్ 2023-24.. కేటాయింపులు ఇవే.

Mon Feb 06 2023 12:03:30 GMT+0530 (India Standard Time)

Allocations of Telangana Budget 2023-24

తెలంగాణ బడ్జెట్ 2023-24 ను సోమవారం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. అంతకుముందు బడ్జెట్ కాపీలతో అసెంబ్లీకి చేరుకున్న ఆయన ముందుగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఏడాది ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈ బడ్జెట్ పై అందరికీ ఆసక్తి నెలకొంది. ఈ బడ్జెట్ లో సామాన్యులకు వరాలు ప్రకటిస్తారని అందరూ ఎదురు చూశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి మొదటి వారంలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టడంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే తెలంగాణ బడ్జెట్ 2023-24లో ఏ శాఖకు ఎన్నికేటాయింపులు చేశారో చూద్దాం..



2023-24 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ రూ.290396 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.222685 కోట్లు పెట్టుబడి వ్యయం రూ.37525 కోట్లు గా పేర్కొన్నారు.  

కేటాయింపులు ఇలా..

వ్యవసాయానికి రూ.26931 కోట్లు

నీటి పారుదల శాకకు రూ. 26885  కోట్లు

విద్యుత్ కేటాయింపులు రూ.12727  కోట్లు

ఆసరా పెన్షన్ల కోసం రూ.12000  కోట్లు

దళిత బంధు కోసం రూ.17700  కోట్లు

ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36750  కోట్లు

ఎస్టీ ప్రత్యేక నిధి కోసం రూ.15233  కోట్లు

బీసీ సంక్షేమం కోసం రూ. 6229  కోట్లు

మహిళా శిశు సంక్షేమం కోసం రూ.2131  కోట్లు

కల్యాణ లక్ష్మి పథకానికి రూ. 2 వేల కోట్లు

షాదీ ముబారక్ కోసం రూ. 450 కోట్లు

మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2200  కోట్లు

అటవీ శాఖ కోసం రూ.1471  కోట్లు

విద్య కోసం రూ. 19093  కోట్లు

వైద్యం కోసం రూ. 12161  కోట్లు

రైతు రుణమాఫీకి రూ.6385  కోట్లు

రైతు బంధు కోసం రూ. 15075  కోట్లు

రైతు బీమా కోసం రూ.1589  కోట్లు

డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి రూ. 12 వేల  కోట్లు

ఆరోగ్య శ్రీ పథకానికి రూ.1463  కోట్లు

ప్రణాళిక విభాగానికి రూ. 11 495  కోట్లు

పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూ. 4834  కోట్లు

హోంశాఖ కు రూ.9599  కోట్లు

పరిశ్రమల శాకకు రూ.4037  కోట్లు

మున్సిపల్ శాఖకు రూ. 11 372  కోట్లు

పంచాయతీ రాజ్ శాఖ కు రూ.31426  కోట్లు

హరితహారం పథకానికి రూ.1471  కోట్లు

కేసీఆర్ కిట్ కోసం రూ.200 కోట్లు

హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.500  కోట్లు

పాత బస్తీ మెట్రోకు రూ.500  కోట్లు

పౌరసరఫరాల కోసం రూ.3 వేల  కోట్లు

ఆయిల్ పామ్ రైతల కోసం రూ. వెయ్యి కోట్లు

ఐ అండ్ పీఆర్ కోసం రూ. వెయ్యి కోట్లు

వర్సిటీల్లో వసతుల కోసం రూ.500  కోట్లు

మహిళా వర్సిటీకి రూ. 100  కోట్లు

మూసీ అభివృద్ధికి రూ. 200  కోట్లు   



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.