ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో విద్యా సంస్థలన్ని ఓపెన్.. కీలక ఆదేశాలు జారీ

Sat Jan 29 2022 19:00:01 GMT+0530 (IST)

All educational institutions in Telangana are open from February 1  Key orders have been issued

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటనను విడుదల చేసింది. కరోనా మూడో వేవ్ నేపథ్యంలో జనవరి 8 నుంచి విద్యా సంస్థలకు సెలువులు ఇచ్చిన వైనం తెలిసిందే. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. కొద్ది రోజులుగా కేసుల నమోదు తక్కువ కాకున్నా.. తీవ్రత తక్కువగా ఉండటం.. కరోనా బారిన పడినోళ్లు ఐదారు రోజులకే బయట పడిపోవటం.. ఆసుపత్రుల్లో చేరిక కూడా తక్కువగా ఉండటంతో.. విద్యా సంస్థల్ని వెంటనే ఓపెన్ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.అయితే.. కరోనా నిబంధనల్ని తప్పనిసరిగా విద్యా సంస్థలు అమలు చేయాల్సి ఉంటుందని రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్ని ఓపెన్ చేయాల్సిందిగా టీ విద్యా శాఖా మంత్రి ప్రకటించారు. అయితే.. పాఠశాలల యాజమాన్యాలు.. ఉపాధ్యాయులు.. విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

మరోవైపు హైకోర్టులోనూ జనవరి 30 తర్వాత పాఠశాలలు తెరుస్తామని హైకోర్టుకు రాష్ట్ర సర్కారు తెలిపిన సంతి తెలిసిందే. అయితే.. వర్సిటీలు..కాలేజీలు మూసి ఉంచి.. స్కూళ్లు తెరుస్తామని చెప్పటంపై టీ హైకోర్టు విస్మయం వ్యక్తం చేయటం తెలిసిందే. పాఠశాలల ప్రారంభంపై  ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయాలన్నారు. ఈ నేపథ్యంలో జనవరి 30తో సెలవులు ముగుస్తున్న వేళ స్కూళ్ల తెరవటంపై  ప్రభుత్వ వైఖరి ఏమిటని హైకోర్టు అడగ్గా.. దీనికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. దీంతో.. అన్ని విద్యాసంస్థలను ఫిబ్రవరి ఒకటి నుంచి ఓపెన్ కానున్నాయి.