Begin typing your search above and press return to search.

సచిన్ కాళ్లపై పడి అక్తర్ సారీ చెప్పాడు : వీరేంద్ర సెహ్వాగ్

By:  Tupaki Desk   |   22 March 2023 8:00 AM GMT
సచిన్ కాళ్లపై పడి అక్తర్ సారీ చెప్పాడు : వీరేంద్ర సెహ్వాగ్
X
సచిన్ టెండూల్కర్ , పాక్ మాజీ పేస్ స్టార్ షోయబ్ అక్తర్ ల మధ్య జరిగిన ఒక ఫన్నీ సంఘటనను భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుచేసుకున్నాడు, ఇది ఇప్పటికీ భారత క్రికెటర్లు ప్రైవేట్‌గా నవ్వుకునే సంఘటనగా నిలిచిపోయిందన్నారు.

ఒక ఈవెంట్‌లో టెండూల్కర్‌ను అక్తర్ తన భుజాలపై ఎత్తలేకపోయాడని, ఇద్దరు క్రికెటర్లు అదుపుతప్పి మైదానంలోనే పడిపోయారని సెహ్వాగ్ చెప్పాడు. అతడు భారతీయుల ఆశల్ని తన భుజాలపై మోస్తున్నాడు. అందుకే అంత బరువు ఉన్నాడని సచిన్ను చమత్కరించినట్లు చెప్పాడు. ‘ఓసారి లక్నోలో భారత్, పాకిస్తాన్ క్రికెటర్ల మధ్య పార్టీ జరిగింది. అప్పుడు అక్తర్ చాలా తాగాడు. సచిన్ ను ఎత్తుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతడు చాలా బరువు ఉండడంతో తనను ఎత్తడం అక్తర్ వల్ల కాలేదు. దాంతో ఇద్దరూ ఒకేసారి కింద పడిపోయారు. అప్పుడు నేను నవ్వుకుండా ఉండలేకపోయాను’ అని వీరేంద్రసెహ్వాగ్ అన్నారు.

ఈ సంఘటనతో అక్తర్‌ చాలా ఇబ్బంది పడ్డాడు. తనను నేను చాలా ఆటపట్టించాను. నీ పని అయిపోయింది. ఇక నీ కెరీర్ ప్రశ్నార్థకమే. నువ్వు మా జట్టులో గొప్ప ఆటగాడిని కింద పడేశావు అంటూ భయపెట్టాను. నా మాటలకు అతడు చాలా భయపడ్డాడు. సచిన్ ఎక్కడ బీసీసీఐకి ఫిర్యాదు చేస్తాడోనని భయపడి తనకు సారీ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. సచిన్ ఎక్కడ కనిపించినా తనను అనుసరిస్తూ క్షమాపణలు చెప్పేవాడు. ఓ రోజు ఏకంగా సచిన్ కాళ్లమీద అక్తర్ పడిపోయాడు. నేను సచిన్ ఎప్పుడు కలిసినా ఈ ఘటనను గుర్తు చేసుకొని ఇప్పటికీ నవ్వుకుంటాం’ అని సెహ్వాగ్ వివరించాడు.

భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య పోటీ మైదానంలో మాత్రమే ఉందని, ఏ జట్టు మరొక జట్టును సందర్శించినా, వారిని ముక్తకంఠంతో ఆతిథ్యంతో స్వాగతించామని సెహ్వాగ్ తమ మధ్య స్నేహాన్ని గుర్తు చేసుకున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.