కాబోయే టీటీడీ ఛైర్మన్ ఆయనేనా.?

Thu Apr 25 2019 19:19:38 GMT+0530 (IST)

Akepati Amarnath Reddy To Be TTD Chairman

వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి.. కార్పోరేషన్ ఛైర్మన్లు వీళ్లకే వస్తాయంటూ ప్రచారం మొదలైంది.. ఎవరికి తోచిన వారు వాళ్లకు తోచినట్లు నచ్చిన పేర్లు రాసి.. రాబోయే క్యాబినెట్ ఇదేనంటూ ఊదరగొడుతున్నారు.. కనీస సామాజిక వర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకోకుండా కొందరు నేతల మెహర్బానీ కోసం పేర్లు రాసేస్తున్నారు... దీంతో గెలుపు సంగతి సరేసరి ఆ ప్రచారాలను నమ్మి కొందరు నేతలు అప్పుడే తాము మంత్రులమైపోయామంటూ తెగ సంబర పడిపోతున్నారు..అయితే మంత్రి పదవుల తో పాటు క్యాబినెట్ ర్యాంకు ఉన్న నామినేటేడ్ పోస్టులు ఉంటాయి.. వీటన్నంటిలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది టీటీడీ ఛైర్మన్ పదవి.. ఒకటి తిరుమల తిరుపతి దేవ స్థానానికి ఉన్న ప్రతిష్ట కావోచ్చు - దేవుని సేవ అనుకోవచ్చు... ఆ పదవి వల్ల దేశంలో ప్రముఖలందిరితో పరిచయాలు ఏర్పాటు చేసుకోవచ్చు.. ఇలా ఆ పదవి కోసం తాపత్రయపడేవాళ్లు చాలా మందే ఉంటారు.. రాయపాటి సాంబశివరావు లాంటి ఎంపీలు - పారిశ్రామికవేత్తలు ఎంతో మంది ఈ పదవిపై మోజు పెంచుకున్నారు... అదీ ఆ పోస్టుకున్న ప్రాధాన్యత.

ఒక వేళ ఈ సారి గనుక జగన్ అధికారంలోకి వస్తే టీటీడీ ఛైర్మన్ ఎవరేనేది తెలిపోయింది.. పక్కా సమాచారం ఆధారంగా.. వైసీపీ నేత - రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి ఈ విషయమై ఈ మధ్యనే జగన్ స్పష్టమైన హామీ ఇచ్చేశారట.. మొన్నటి ఎన్నికలకు ముందు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లి కార్జున రెడ్డి రాకతో అమర్ నాథ్ రెడ్డికి వైసీపీ సీటు దక్కలేదు.. జగన్ను - పార్టీని నమ్ముకున్నందుకు ఇదేనా బహుమానమంటూ అమర్ నాథ్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.. కానీ పెద్ద ఎత్తున అసమ్మతి తెలియజేయలేదు.. జగన్ హామీ కి కట్టుబడి చల్లారబడ్డారు.. ఆ సందర్బంలో ఖచ్చితంగా ఎమ్మెల్సీ చేస్తానని జగన్ హామీ ఇచ్చారట.. అయితే తనకు టీటీడీ ఛైర్మన్ గా చేయాలని ఉందని అమర్ నాథ్ రెడ్డి తన ఇష్టాన్ని బయటపెట్టారట.. ఇక ఏం ఆలోచించకుండా.. మనమే అధికారంలోకి వస్తున్నాం.. నువ్వే కాబోయే టీటీడీ ఛైర్మన్ అంటూ పార్టీ పెద్దనాయకుల ముందే స్పష్టంగా చెప్పేశారట..

 అయితే రాజకీయాల్లో నేతల హామీలు నీటి రాతలైన సందర్బాలూ ఉన్నాయి.. కానీ ఈ మధ్య కోస్తా జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత తనకు టీటీడీ ఛైర్మన్ గా నియమించాలని పార్టీ ఫండ్ గా చాలా మొత్తం సమర్ఫించుకుంటానని జగన్ కు ఆఫర్ చేశారట.. అన్నా .. ఆ విషయం మర్చిపోండి.. అమర్ నాథ్ రెడ్డి అన్నకు మాట ఇచ్చేశా.. కాబోయే టీటీడీ ఛైర్మన్ అతనే.. ఇంకెవరూ ఆశలు పెట్టుకోవద్దంటూ కుండబద్దలు కొట్టేశారట జగన్.. దీంతో జగన్ అధికారంలో వస్తే అమర్ నాథ్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ కావడం ఖాయమని తెలుస్తోంది...