Begin typing your search above and press return to search.

అక్బరుద్దీన్ తో భట్టి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి.. కాంగ్రెస్ తో ఎంఐఎం దోస్తీకి అడుగులు

By:  Tupaki Desk   |   7 Feb 2023 8:00 AM GMT
అక్బరుద్దీన్ తో భట్టి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి.. కాంగ్రెస్ తో ఎంఐఎం దోస్తీకి అడుగులు
X
మంత్రి కేటీఆర్ తో విభేదాలు పెట్టుకున్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ తాజాగా కాంగ్రెస్ నేతలను కలవడం తెలంగాణ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ వర్సెస్ అక్బర్ లొల్లిలో ఇరువురు తగ్గకుండా విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో ఈరోజు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

కేటీఆర్ సవాల్ తో వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీచేస్తామని అక్బరుద్దీన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలతో భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంఐఎం కూడా సెక్యూలర్ పార్టీ అని.. అందుకే తాము కలిశామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. ఎంఐఎంతో మాట్లాడితే తప్పా అని ప్రశ్నించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఎంఐఎం పార్టీ మంచి మిత్రపక్షంగా ఉండేది. వైఎస్ఆర్ ఉన్నప్పుడు వీరిని మంత్రివర్గంలోకి కూడా ఆహ్వానించారు. అయితే సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి అయ్యాక కాంగ్రెస్, ఎంఐఎం మధ్య దూరం పెరిగింది. కిరణ్ సీఎంగా అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేసులు పెట్టించి మరీ జైలుకు పంపాడు.

అయితే తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ అధికారంలోకి రావడం.. కేసీఆర్ సెక్యూలర్ ఎజెండాతో అసదుద్దీన్ తో స్నేహగీతం ఆలపించి ఇద్దరూ సామరస్యంగా పోటీ చేసి గెలవడంతో వీరి అనుబంధం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లింది.

అయితే తాజాగా అసెంబ్లీ వేదికగా అక్బరుద్దీన్ వర్సెస్ కేటీఆర్ వార్ పతాకస్తాయికి చేరింది. 7 సీట్లలో గెలిచిన మీరా మాకు చెప్పేది.. మీతో టైం వేస్ట్ అని కేటీఆర్ ప్రకటన చిచ్చు రేపింది. మేం వచ్చే ఎన్నికల్లో 50 చోట్ల పోటీచేస్తామంటూ అక్బర్ చేసిన ప్రకటన కాంగ్రెస్ లో ఆశలు రేపింది. అక్బర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.