హీరో సినిమా వివరాలు చెప్తానంటే.. ఎమ్మెల్యేగా గెలిపించారు!

Thu May 06 2021 09:00:01 GMT+0530 (IST)

Ajith Fans Remind BJP'S Vanathi Srinivasan Of A Promise She Made On 'VALIMAI'

 తమిళనాడు రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయో.. అక్కడి రాజకీయ సినిమా అభిమానులు కూడా అలాగే ఉంటారు. నాలుకలు చేతులు తేలిగ్గా కోసేసుకుంటారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఏమంటే.. తమ అభిమాన నటుడి సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల్లో హామీ ఇచ్చారట. ఈ హామీకి సంబర పడిన ఫ్యాన్స్ ఓట్లు వేసేశారట! అది కూడా మరో సినిమా స్టార్ కు వ్యతిరేకంగా కావడం గమనార్హం.తమిళనాడులోని కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి ప్రముఖ నటుడు కమల్ హాసన్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. కానీ.. ఆయన ఓడిపోయారు. తన సమీప బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ గెలుపొందారు. ఈ గెలుపుతో ఆమె ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మొదలుకొని బీజేపీ నేతలందరికీ ఆమె ట్విటర్ వేదికగా థాంక్స్ చెప్పారు.

అయితే.. ఇక్కడికి దూసుకొచ్చారు హీరో అజిత్ ఫ్యాన్స్. తమకు అజిత్ అప్ కమింగ్ మూవీ 'వాలిమై' గురించిన అప్డేట్ ఇస్తామని హామీ ఇచ్చారు కదా.. ఎప్పుడు చెబుతారని ప్రశ్నించడం మొదలు పెట్టారు. మీమ్స్ తో ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో.. అందరికీ అసలు విషయం అప్పుడు అర్థమైంది.

ఇది చూసిన చాలా మంది.. హీరో సినిమా అప్డేట్ కోసం ఎమ్మెల్యేకు ఓటేశారా?  అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అది కూడా కమల్ హాసన్ కు వ్యతిరేకంగా ఓటు వేయడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘అరవంలో అంతే.. అరవంలో అంతే' అని సెటైర్లు వేస్తున్నారు.