బీజేపీలోకి రాహుల్ సన్నిహితుడు

Thu Jun 10 2021 07:00:01 GMT+0530 (IST)

Ahead of the UP elections a High profile Congress leader joins BJP

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ లో కీలక నేత బీజేపీలో చేరిపోయారు. ఓవైపు బీజేపీ బలపడుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ రోజురోజుకు బలహీనమవుతోంది. తాజాగా రాహుల్ గాంధీకి సన్నిహితుడైన కీలక నేత బీజేపీలో చేరడం సంచలనమైంది.యూపీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన యువ నేత జితిన్ ప్రసాద బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.

బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన జితిన్ ప్రసాద గత ఏడాది జులైలో బ్రహ్మణ చేతనా పరిషత్  నెలకొల్పి ఆ సామాజికవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన జితేంద్ర ప్రసాద తనయుడే జితిన్. 2001లో యూత్ కాంగ్రెస్ల ో చేరిన జితేంద్ర 2004 లోక్ సభ ఎన్నికల్లో యూపీలోని షాజహాన్ పూర్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీతో తనకు మూడు తరాల అను బంధం ఉంది. ఆయన బీజేపీలో చేరడం కాంగ్రెస్ కు షాకింగ్ గా మారింది.