Begin typing your search above and press return to search.

రసిక ప్రియులకు వయస్సు అడ్డంకి కాదట..

By:  Tupaki Desk   |   28 Feb 2020 2:30 AM GMT
రసిక ప్రియులకు వయస్సు అడ్డంకి కాదట..
X
శృంగారానికి వయస్సుతో సంబంధం లేదనేది అక్షరసత్యం. అయితే కొందరు సీనియర్ సిటిజన్లు వయస్సును సాకు చూపించి శృంగారానికి దూరంగా ఉంటున్నారు. ఇది ఏమాత్రం వారికి క్షేమం కాదని సెక్సాలిజిస్టులు సూచిస్తున్నారు. జీవితంలో రసికత లేకపోతే మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సెక్స్ థెరిపిస్టులు హెచ్చరిస్తున్నారు.

వయస్సు రీత్య 50 ఏళ్లు నిండిన దంపతులు శృంగారానికి ఫుల్ స్టాప్ పెడుతున్నారు. ఇందుకు వాళ్లు చెప్పే సాకులు అనేకమున్నాయి. 50ఏళ్లు రాగానే దంపతులిద్దరు వారికి వారే పెద్దరికం ఆపాదించుకుంటున్నారు. పిల్లలు పెద్దవాళ్లు కావడం, వాళ్ల పెళ్లిళ్లు, మనువళ్లు, బాధ్యతల వేటలోపడి శృంగారానికి దూరంగా ఉంటున్నట్లు తేలింది. వయస్సులో ఉన్నప్పుడు ఉన్న సామర్థ్యం ఇప్పుడు ఉండదనే అనుమానంతో చాలామంది మగవాళ్లు సెక్స్ లైఫ్ కు దూరంగా ఉంటున్నారట. కొంతమంది తమ పార్టనర్ సహకరించక పోవడంతో శృంగారానికి తిలోదకాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే వీరికోసమే కొత్తగా ‘ఏజ్ లెస్ సెక్స్ వాలిటీ (ageless sexuality) అన్న కాన్సెప్ట్ మొదలైంది. ఈ కాన్సెప్ట్ లో సీనియర్లు వయస్సును మరిచిపోయి శృంగారంలో ఉత్సాహం చూపించాలంటున్నారు. దంపతులిద్దరిలో ఒకరు చొరవ చూపితే మరొకరు కాదనుకుండా శృంగారంలో పాల్గొనాలని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు. 50ఏళ్లు దాటిన వాళ్లు చేసే శృంగారాన్ని ఏజ్ లెస్ సెక్స్, సీనియర్ సెక్స్ అనే పేర్లతో పిలుస్తున్నారు. శృంగారమంటే సినిమాల్లో చూపించినట్లు కుర్రాళ్లు మాత్రమే పాల్గొనేది కాదని చెబుతున్నారు. రోమాన్స్ కు వయస్సు అసలు సంబంధం లేదని సెక్సాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు.

శృంగారంలో చాలారకాల పద్ధతులుంటాయని చెబుతున్నారు. అంతేకానీ వయస్సు సాకుతో తప్పించుకుంటే శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పడక సుఖానికి దూరంగా ఉంటున్న సీనియర్లు ఇప్పటికైనా తమ తప్పును తెలుసుకోవాలని చెబుతున్నారు. నిజమైన రసికప్రియులకే శృంగారంలో కామలే తప్ప.. ఫుల్ స్టాప్ ఉండదనేది సెక్సాలజిస్టులు చెబుతున్నారు. కోరికలు గుర్రాలై పరుగుతుంటే.. ఫీలింగ్స్ అనుచుకోవడంలో అర్థం లేదని సూచిస్తున్నారు. ఇంకేందుకు మరీ ఆలస్యం.. లేట్స్ డూ కుమ్ముడు..అనే పాటేసుకోవడమే ఇక మిగిలింది..