జైల్లో తోటి ఖైదీలతో ఆప్తాబ్ ఆ పనులు చేస్తున్నాడట

Fri Dec 09 2022 16:00:01 GMT+0530 (India Standard Time)

Aftab Poonawala Behaviour in Prison

కనీస కనికరం లేకుండా ప్రాణంగా ప్రేమించినట్లుగా వ్యవహరించి.. నెలల తరబడి కలిసి ఉన్న వ్యక్తిని అత్యంత కిరాతకంగా ముక్కలు ముక్కలు చేయటం.. వాటిని ఫ్రిజ్ లో భద్రంగా ఉంచి.. ఒక్కో భాగాన్ని ఒక్కో ప్రాంతంలో పడేస్తూ వచ్చిన సైకో ఆఫ్తాబ్  పూనావాలా కొద్ది రోజులుగా తీహార్ జైల్లో ఉండటం తెలిసిందే. విచారణలో భాగంగా తన బాగస్వామి శ్రద్దా వాకర్ ఆన్ లైన్ లో పరిచయమైన మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో తాను చంపినట్లుగా పేర్కొనటం తెలిసిందే.అయితే.. అతగాడి మాటలపై కొత్త సందేహాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారులు ఆఫ్తాబ్ చాలా తెలివైన వ్యక్తిగా చెబుతున్నారు. ఈ దారుణ హత్య కేసుకు సంబంధించి ఒక కొత్త ట్విస్టు వెలుగుచూడనుందని చెబుతున్నారు.

నార్కో పరీక్షలో ఆఫ్తాబ్ చాలా పెద్ద ఆధారాల్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. తీహార్ జైల్లో ఉన్న అతగాడు ఎలా ఉన్నాడన్న విషయంపై కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.

తీహార్ జైల్లో తన తోటి ఖైదీలతో చెస్ ఆడుతున్నాడని.. ఇంగ్లిషు పుస్తకాల్ని చదువుతున్నాడని అధికారులు చెబుతున్నారు. ప్రియురాలిని అత్యంత దారుణంగా చంపేసిన వైనంపై ఎలాంటి పశ్చాతాపం లేకపోవటం తెలిసిందే.

ఆ మధ్యన అదుపులోకి తీసుకున్న ఆప్తాబ్ ను జైలుకు తీసుకెళ్లే వేళలో అతడిపై దాడికి ప్రయత్నం జరగటం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడ్ని మరోసారి ఈ రోజు కోర్టుకు తీసుకెళ్లనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.