బీఆర్ఎస్ పొత్తు.. జానారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్లారిటీ

Sat Apr 01 2023 15:11:53 GMT+0530 (India Standard Time)

Addanki Dayakar Responds On JanaReddy Comments

పెద్దలు జానారెడ్డికి కాంగ్రెస్ పై నమ్మకం సడలుతున్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన అధికార బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో పెనుదుమారం రేపాయి. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు అనేది ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని జానారెడ్డి నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీపై పోరుకు ఎన్నికలకు సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్ లక్ష్యంగా రేవంత్ టీం పోరాటం చేస్తున్న సమయంలో ఇప్పుడు జానారెడ్డి చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం మొదలైంది.

రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య పొత్తుకు సంబంధించి కొంత కాలంగా చర్చ సాగుతోంది.  వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ పొత్తులకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ సైతం బీఆర్ఎస్ తో పోరాటమే కానీ.. పొత్తులు ఉండవని పలు మార్లు స్పష్టం చేశారు.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాత్రం మోడీ పాలనపై ప్రజలు గొంతు విప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలన్నారు. కాగా పొత్తులపై జానారెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పరోక్షంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలుస్తాయనే విధంగా ఆయన వ్యాఖ్యలు ప్రొజెక్ట్ అయ్యాయి.

జానారెడ్డి వ్యాఖ్యలు పెనుదమారం రేపాయి. కాంగ్రెస్ ను ఇరుకునపెట్టాయి. కార్యకర్తల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని భావించిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేయడంపై దృష్టి సారించారు. జానారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ తో 1000శాతం పొత్తులు ఉండవని దయాకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనన్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని సూచించారు.       


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.