Begin typing your search above and press return to search.

పదేళ్లలో అదానీ సంపద.. గణనీయమైన మార్పును గమనించారా..!

By:  Tupaki Desk   |   3 Feb 2023 7:00 PM GMT
పదేళ్లలో అదానీ సంపద.. గణనీయమైన మార్పును గమనించారా..!
X
బడా పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకి అనేక రంగాల్లో వ్యాపారాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు సంబంధించిన కంపెనీలు పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. గత పదేళ్లలో ఆయన ఆస్తుల విలువ గణనీయంగా పెరిగిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.

అయితే ఇదంతా హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక ముందు మాట. అమెరికాకు చెందిన ఈ సంస్థ అదానీ గ్రూప్ వ్యాపారాలపై పరిశోధన చేసి ఆ కంపెనీ పలు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోచింపింది. ఈ క్రమంలోనే ఆదానీ గ్రూప్ వ్యాపారాలన్నీ గాలిమేడలని ప్రకటించింది. దీంతో అదానీ గ్రూప్ కు చెందిన స్టాక్స్.. షేర్స్ అన్నీ కూడా పతనం కావడం ప్రారంభించాయి.

ఈ ప్రకటన తర్వాత జరిగిన మూడు ట్రేడింగ్ సెషన్లలో అదానీ సంపద ఏకంగా 34 బిలియన్ల డాలర్లు ఆవిరైంది. దీంతో ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితా టాప్ 10 నుంచి స్థానం కోల్పోయారు. 11 వ స్థానానికి పడిపోయిన తర్వాత అదానీ గ్రూప్ మార్కెట్ వర్గాల్లో 20వేల కోట్ల సమీకరణ లక్ష్యంగా ఎఫ్వీవోకు సిద్ధమైంది.

మూడు రోజుల వ్యవధిలోనే అదానీ గ్రూప్ 20వేల కోట్ల పెట్టుబడులను సమీకరించింది. అయితే పార్లమెంటులో 2023-24కు సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన తర్వాత అదానీ షేర్స్ నేలచూపులు చూశాయి. దీంతో పెట్టుబడులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఈ తరుణంలో అదానీ గ్రూప్ తన ఎఫ్పీవోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ క్రమంలోనే గౌతమ్ అదానీ ప్రపంచ ధనవంతుల టాప్ 20 జాబితాలో స్థానం కోల్పోయినట్లు బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ ప్రకటించింది. ప్రస్తుతం 61.3 బిలియన్లు డాలర్లతో సంపదతో అదానీ 21వ స్థానంలో కొనసాగుతున్నారు. అది కాస్తా ఇంకా దిగజారిందని గత పదేళ్లలో అదానీ సంపదను పరిశీలిస్తే అర్థమవుతుంది.

2013లో అదానీ సంపద 3.1 బిలియన్ డాలర్లు కాగా 2014లో 2.8 బిలియన్ డాలర్లకు తగ్గింది. 2015లో 6.5 బిలియన్ డాలర్లు కాగా 2016లో 3.5 బిలియన్ డాలర్లకు తగ్గింది. 2017లో 5.8 బిలియన్ డాలర్లు కాగా 2018లో 9.7 బిలియన్ డాలర్లు.. 2019లో 8.7 బిలియన్ డాలర్లు.. 2020లో 8.9 బిలియన్ డాలర్లు.. 2021లో 50.50 బిలియన్ డాలర్లు.. 2022లో 146 బిలియన్ డాలర్లుగా ఉంది.

2023లో ప్రస్తుతం ఆయన సంపద 57.2 బిలియన్ డాలర్లుగా ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే అదానీ షేర్స్ కొద్దిరోజులుగా పతనం అవుతుండటం ఆయన సంపద మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.