Begin typing your search above and press return to search.

అప్పుల్ని తీర్చేస్తున్న అదానీ.. తాజాగా ఎంత తీర్చారంటే?

By:  Tupaki Desk   |   7 Jun 2023 8:45 PM GMT
అప్పుల్ని తీర్చేస్తున్న అదానీ.. తాజాగా ఎంత తీర్చారంటే?
X
కొద్ది నెలల క్రితం అదానీ గ్రూప్ తీరు పైన బోలెడన్ని విమర్శలు వెల్లువెత్తేవి. ఆ గ్రూప్ షేర్లు అంతకంతకూ పెరిగిపోవటం.. అదే సమయం లో ఆ కంపెనీ ఎడాపెడా అప్పుల్ని చేసుకుంటూ.. వ్యాపారాల్ని విస్తరించుకుంటూ పోతున్న వైనం పై బోలెడంత చర్చ జరిగేది.

ఆ సమయంలోనే హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన ఆరోపణల నివేదిక క్రియేట్ చేసిన రచ్చ.. ఆ సందర్భంగా ఆ గ్రూపు కంపెనీల షేర్ ధరలు ఎంత దారుణంగా పడిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న మాట కు తగ్గట్లే.. తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమ సంస్థ తీసుకుంటున్న రుణాల పై వస్తున్న విమర్శల కు చెక్ చెప్పాల ని భావించిన అదానీ గ్రూప్.. గడిచిన కొంతకాలంగా తమ రుణ భారాన్ని తగ్గించేసుకుంటున్న పరిస్థితి. ముందస్తు చెల్లింపుల్లో భాగంగా సుమారు రూ.21,900 కోట్లు డాలర్లలో చెప్పాలంటే 2.65 బిలియన్ డాలర్ల భారీ మొత్తం లో రునాన్ని తీర్చేసి విషయాన్ని తాజాగా వెల్లడించింది.

హిండెన్ బర్గ్ రిపోర్టు తర్వాత నుంచి రుణాల్ని తీర్చివేసే అంశం పై ఎక్కువగా ఫోకస్ పెట్టిన అదానీ అందుకు తగ్గట్లే కార్యాచరణ ను రూపొందించికున్నట్లుగా కనిపిస్తోంది. ఓపక్క రూ.21వేల కోట్ల అప్పును తీర్చటంతో పాటు.. అంబుజా సిమెంట్స్ కొనుగోలు కు సంబంధించి చేసిన రుణం.. దాని మీద వడ్డీని కలిపి మొత్తంగా 70 కోట్ల డాలర్ల రుణాన్ని తీర్చేసింది. ఇందులో వడ్డీ భాగమే 20.3 కోట్ల డాలర్లు ఉంటుందని చెబుతున్నారు.

ఇక.. ప్రమోటర్లు గ్రూపు లోని నాలుగు లిస్టెడ్ కంపెనీల్లో షేర్ల విక్రయం ద్వారా జీ క్యూజీ పార్ట్ నర్స్ నుంచి రూ.15,446 కోట్లు సమకూర్చుకున్నట్లుగా చెబుతున్నారు. హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణల్లో పస లేదన్న విషయాన్ని తెలియజేయటమే కాదు.. తీసుకున్న రుణాల కు సంబంధించి ఇచ్చిన కమిట్ మెంట్ కంటే ముందుగా చెల్లింపులు జరపటం ద్వారా తన సత్తాను చాటే ప్రయత్నం చేస్తోంది. అదానీ చెల్లింపుల తీరు చూసిన వారిప్పుడు ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి.క్రెడిట్ లైన్ల పై రోలింగ్ చేయటం ద్వారా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూపే వీలుందని చెబుతున్నారు.