Begin typing your search above and press return to search.

5 రోజులుగా అదానీ వ్యవహారం పార్లమెంట్ లో మోడీ బుక్కైనట్టేనా?

By:  Tupaki Desk   |   7 Feb 2023 2:00 PM GMT
5 రోజులుగా అదానీ వ్యవహారం పార్లమెంట్ లో మోడీ బుక్కైనట్టేనా?
X
అదాని గ్రూప్ వ్యవహారం ఉభయ సభలను కంపింపజేస్తోంది. ప్రధానమంత్రి మోదీ ఈ విషయంపై నోరు విప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు పార్లమెంట్ లో..ఇటు రాజ్యసభలో ఇదే విషయంపై ఆందోళన చేయడం గమనార్హం. వరుగా 5 రోజుల పాటు అదాని వ్యవహారంపైనే రభస చేస్తూ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు. అదానీ, మోడీ చీకటి కోణాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సభ్యులైతే ఈ విషయాన్నే ప్రధాన అంశంగా లేవనెత్తుతున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ వివాదంపై ప్రధాన మంత్రి మోదీ వివరణ ఇవ్వాలని పట్టుబట్టడం చర్చనీయాంశంగా మారింది.

అదానీ గ్రూప్ వ్యవహారం ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని వాదిస్తోంది. ఈమేరకు కేంద్ర ఆర్థిక కార్యదర్శి సోమనాథ్ ఇది 'టీ కప్పులో తుఫాన్ ' అని అన్నారు. ఇది అదానీ గ్రూప్ ఇన్వెస్టర్లకు సంబంధించిన విషయం.. దానిపై మేమేందుకు వివరణ ఇస్తామని అన్నారు. దేశ బ్యాంకింగ్ పైన, ఆర్థిక సంస్థలపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం ఉండదని అన్నారు. అయితే మరికొకందరు ప్రభుత్వ ప్రతినిధులు మాత్రం అదాని గ్రూప్ లో మా ఇన్వెస్ట్ మెంట్ తక్కువే అని అనడం గమనార్హం. అయితే అదానీ గ్రూప్ లో ఎల్ ఐసీ, ఎస్బీఐ, పీఎన్బీ షేర్లు ఉన్న విషయం తెలిసిందే. ఇవి ఇప్పుడు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి ఈ వివాదంపై మోదీ ప్రభుత్వానికి ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. ఇదిలా ఉండగా ఒక అమెరికన్ షార్ట్ సెల్లర్ తన షేర్లను క్రాష్ చేసినందుకు అదానీ గ్రూప్ కుప్ప కూలడంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు ఆదేశించాలని ప్రధాన ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నయి. ఈ డిమాండ్ లో భాగంగా లీడర్లు గందరగోళం సృష్టించడంతో ఉభయ సభలు స్తంభించిపోతున్నాయి. ప్రభుత్వం అదానీ గ్రూప్ వ్యవహారాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందని, చర్చకు సిద్ధం కాకుండా వెనక్కి వెళ్తోందని అంటున్నారు. మొత్తంగా మోదీ ప్రభుత్వం ఈ విషయంలో ఇరుకున పడిందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అదానీ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసిన సంస్థలే కాకుండా సామాన్యుల షేర్లు సైతం భారీ నష్టాన్ని చవి చూస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచంలో మూడో అత్యంత సంపన్నుడైన అదానీ పోర్బ్స్ బిలియనీర్ జాబితాలో 17వ స్థానానికి పడిపోయాడు. గ్రూప్ లోని కీలక అదానీ ఎంటర్ ప్రైజెస్ ప్రారంభ వాణిజ్యంలో మరింత 9.6 శాతం పడిపోయింది. అదానీ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ 10 శాతం క్షీణించగా, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, అదానీ పవర్, అదానీ విల్మార్ దాదాపు 5 శాతం పడిపోయాయి. అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ మాత్రమే 1.2 శాతం వృద్ధిలో కొనసాగుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.