తెలుగు దేశం పార్టీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ నాయకుడికీ దక్కని అద్భుతమైన.. అత్యంత అరుదైన అవ కాశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు లభించింది. దీనిని ఆయన ఎలా సద్వినియోగం చేసు కుంటారనేది కూడా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లడం లేదు. పైగా.. ఆయన వెళ్లనని శపథం కూడా చేశారు. దీంతో సభలో చంద్రబాబు కనిపించడం లేదు.
వాస్తవానికి గత సభలోనూ చంద్రబాబు లేరు. అయితే.. అప్పటికి ఇప్పటికి.. తేడా ఏంటంటే.. ఈ ఏడాది కాలంలో టీడీపీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. దీంతో పార్టీ పుంజుకుంది. ఈ ప్రభావం అసెంబ్లీలో కూడా కనిపించాలనేది చంద్రబాబు భావన. అయితే ఆయన మాత్రం సభకు రావడం లేదు. పైగా.. సమస్యలను ప్రస్తావించాలనే ఉద్దేశం మాత్రం ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సభా బాధ్యతలు మొత్తంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నే చూస్తున్నారు.
ఇది ఒక చక్కని అవకాశం. 40 ఏళ్లలో ఏనాడూ.. టీడీపీ ఇలా.. పార్టీలో మరో నేతకు సభా బాధ్యతలు అప్ప గించిన హిస్టరీ లేదు. పైగా.. అత్యంత కీలకమైన వచ్చే ఎన్నికలకు ముందు జరుగుతున్న బడ్జెట్ సమావే శాలు కావడంతో ప్రస్తుత సభలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో ఆయన పార్టీ నేతలను ఎలా నడిపిస్తారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు మండలిలోనూ.. కీలక నాయకుడు.. ఫైర్ బ్రాండ్ నారా లోకేష్ కనిపించడం లేదు.
ప్రస్తుతం నారా లోకేష్ పాదయాత్రలో ఉన్నారు. దీంతో ఆయన లేని లోటును భర్తీ చేయాల్సిన బాధ్యత మండలి టీడీపీ పక్ష నాయకుడిగా యనమలపై పడింది. దీంతో ఆయనపైనా అవే ఆశలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మండలి మాట ఎలా ఉన్నప్పటికీ.. అసెంబ్లీ పైనే ఎక్కువగా టీడీపీ ఆశలు ఉన్న నేపథ్యంలో అచ్చెన్న వ్యూహాలు.. పార్టీని ఎటు నడిపిస్తాయి.. ఈ గోల్డెన్ ఛాన్స్ను ఆయన ఎలా వాడుకుంటారన్నది ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింద.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.