Begin typing your search above and press return to search.

రూ.5వేల నుంచి రూ.40వేల కోట్లకు చేరుకున్న రాకేశ్ ఝున్ ఝున్ రూల్స్ ఇవే

By:  Tupaki Desk   |   14 Aug 2022 3:38 PM GMT
రూ.5వేల నుంచి రూ.40వేల కోట్లకు చేరుకున్న రాకేశ్ ఝున్ ఝున్ రూల్స్ ఇవే
X
విజేతల కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. విజేతలు రాత్రికి రాత్రి కాలేరు. అందుకోసం ఎంతో కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఆ కోవకే చెందుతారు భారత వారెన్ బఫెట్ గా అభివర్ణించే రాకేశ్ ఝున్ ఝున్ వాలా. అనారోగ్య సమస్యతో హఠ్మారణం చెందిన ఆయన రియల్ కథ రీల్ కు మించినట్లుగా ఉంటుంది. కేవలం రూ.5వేలతో మొదలైన ఆయన ప్రయాణం ఏకంగా రూ.40వేల కోట్లకు చేరుకున్నారు. స్టాక్ మార్కెట్లో అత్యంత సక్సెస్ ఫుల్ ట్రేడర్ గా అభివర్ణించే ఆయన.. అంతటి సక్సెస్ ను ఎలా సొంతం చేసుకున్నారు? ఆయన విజయసూత్రాలేంటి? అన్నది స్టాక్ మార్కెట్లో మదుపు చేసే.. చేయాలనుకునే కోట్లాది మందికి ఎంతో ఉపయుక్తం.

ఇంతకీ ఆయనేం చెప్పారన్నది చూస్తే..

- మార్కెట్లే సుప్రీం అని నమ్మకుంటే మీరు తప్పు చేశారనే విషయాన్ని ఒప్పుకోలేరు.

- మీ తప్పును ఒప్పుకోకపోతే మీరు ఎన్నటికి నేర్చుకోలేరు.

- ఇతరులు అమ్ముతున్నప్పుడు కొనండి. ఇతరులు కొనేటప్పుడు మీ షేర్లను అమ్మేయండి.

- అవకాశాలు టెక్నాలజీ రూపంలోనో.. మార్కెటింగ్ బ్రాండ్లు.. క్యాపిటల్ రూపంలోనో వస్తాయి. వాటిని వెంటనే గుర్తించే సామర్థ్యం ఉండాలి.

- స్టాక్ మార్కెట్లో విజయవంతం కావాలంటే తప్పుల నుంచి వెంటనే నేర్చుకునే సామర్థ్యం ఉండాలి.

- ప్రపంచాన్ని నీ కోణంలో కాదు.. వాస్తవంగా ఎలా ఉందో అలానే చూడు.

- అనవసరపు అంచనాలతో పెట్టుబడి పెట్టకండి. పేరొందిన కంపెనీల జోలికి ఎన్నడూ వెళ్లకండి.

- ఇందులో ఎవరికి వారిదే బాధ్యత అనే విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు.

- స్థిరమైన మనస్తత్వం లేకుండా విజయం సాధించలేరు

- మార్కెట్లు మహిళల వంటివి. ఎప్పుడు గంభీరంగా.. మిస్టరీగా ఊహించని విధంగా.. చంచలంగా ఉంటాయి.

- పోరాట స్ఫూర్తిని అలవర్చుకోండి. చెడును మంచిగా భావించండి.

- నష్టాలకు ముందుగా రెఢీ కండి. మదుపరుల జీవితంలో నష్టాలు ఒక భాగం.

- విజయవంతమైన మదుపరిగా ఎదగాలంటే మొదట కొన్ని తప్పులు చేయాలి. వాటి నుంచి కొంత నేర్చుకోవాలి.

- విజయానికి షార్ట్ కట్ లు లేవు.

- విజయవంతమైన మదుపరిగా మారాలంటే ఎప్పటికప్పుడు మార్కెట్ పైన పూర్తి అవగాహనతో ఉండాలి.

- భారీ లాభాలు పొందే వేళలో పేదలకు అపన్న హస్తం అందించే ఆలోచన ఉండాలి. ఇలా చేస్తే ఏదో మంచి జరుగుతుందని మాత్రం అస్సలు అనుకోవద్దు.