Begin typing your search above and press return to search.

కర్ణాటక బాల యోగి చెప్పింది చెప్పినట్టే జరుగుతుందా?

By:  Tupaki Desk   |   3 April 2020 11:50 AM GMT
కర్ణాటక బాల యోగి చెప్పింది చెప్పినట్టే జరుగుతుందా?
X
అతనొక బాల మేధావి.. మేధావే కాదు.. జరగబోయేది ముందే చెప్పేసి అందరి నోర్లు వెళ్లబెట్టేలా చేస్తున్నాడు మైసూరుకు చెందిన ఈ బాల జ్యోతీష్యుడు. ఈ బాల జ్యోతీష్యుడు పేరు అభిజ్ఞ ఆనంద్. ఈ బుడ్డ మేధావి కరోనా గురించి గతంలోనే హెచ్చరించాడు. అయితే , అప్పుడు ఆ విషయం పై ఎవరు పెద్దగా ఆసక్తి కనబరచకపోయినా కూడా ..ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని చూస్తుంటే ఆ బాల మేధావి చెప్పిందే జరుగుతుందా అనే అనుమానం అందరిలో మెదులుతుంది.

అసలు విషయం ఏమిటి అంటే .. ప్రస్తుతం ప్రపంచం మొట్ట కరోనా మహమ్మారి వల్ల భయంతో వణికిపోతోంది. కరోనాకి సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో , కరోనాను అరికట్టడానికి చాలాదేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం లాక్ డౌన్ అమలు చేయకుండా తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నారు. కనిపించని శత్రువుతో ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తుండగా.. వైరస్‌ వ్యాప్తిపై రకరకాల కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. కోరంకి జబ్బు పుట్టుకొచ్చి లక్షలాది మందిని కబళిస్తుందని పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఎప్పుడో చెప్పారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

కాలజ్ఞానం రచయిత ..శ్రీ పోతులూరి బ్రహ్మంగారు .. ఈశాన్యంబున విషగాలి పుట్టేను, లక్షలాది ప్రజలు సచ్చేరయ, కోరంకి అను జబ్బు కోటిమందికి తగిలి - కోడిలాగ తూగి సచ్చేరయ ... అని తన కాలజ్ఞానంలో చెప్పారని, అయన చెప్పిన విధంగానే ఇప్పుడు జరుగుతుంది అని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో మరో ప్రచారం కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. 2020లో కరోనా వైరస్‌ వస్తుందని ముందుగానే ఓ బాలమేధావి చెప్పాడని - బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతున్నట్టే... నేడు మైసూరుకు చెందిన బాల మేధావి అభిజ్ఞా ఆనంద్‌ చెప్పిందే జరుగుతోందని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే , ఈ కర్ణాటక బాల మేధావి కరోనా వైరస్ అనే పేరు చెప్పకపోయినా కూడా , మిగతా అన్ని విషయాలు చెప్పినట్టుగానే జరుగుతుండడంతో అభిజ్ఞ ప్రిడిక్షన్‌ మీద ఇప్పుడు జనాల్లో నమ్మకం బాగా పెరిగిపోయింది. అసలు... నెలల క్రితమే ఓ యూట్యూబ్ వీడియోలో ఏం చెప్పాడంటే? 2020 లో ప్రపంచంలో ఓ బయలాజికల్ వార్ జరుగుతుందని అప్పుడు చైనా దేశమే బాగా ఇబ్బందిపడిపోతుందని మొత్తం రవాణా అంతా ఎక్కడికక్కడ స్థంబించిపోతుందని చెప్పాడు.