ఏపీలో పింఛన్ తీసుకోవాలంటే ఆ పత్రం ఇవ్వాల్సిందే !

Sat Oct 31 2020 23:00:24 GMT+0530 (IST)

In order to get a pension in AP, you have to give that document!

ఏపీలో పింఛన్ కు దరఖాస్తు చేసుకునేవారికి ఓ ముఖ్యమైన గమనిక. కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తుదారు ఆధార్ కార్డులో వయసుకు సంబంధించి జరిగిన మార్పులు చేర్పుల వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ..రాష్ట్రంలో పింఛన్ డబ్బులు 2 వేలకి పైగా వస్తుండటంతో కొందరు ఆధార్ కార్డులో తమ వయసును మార్చుకుని పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే స్పందించిన అధికారులు అనర్హులు లబ్ధిపొందకుండా చూసేందుకు కొత్త నిబంధన తీసుకొచ్చారు.కొత్త నిబంధన ప్రకారం పింఛనుకు దరఖాస్తుచేసుకునేవారు తమ ఆధార్ కార్డు అప్‌డేట్ హిస్టరీ ప్రింట్ అవుట్ కూడా తప్పనిసరిగా సమర్పించాలి. అందులో ఏమైనా మార్పులు చేర్పులు జరిగి ఉంటే ఆధార్ కార్డులో తక్కువ వయసును పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తు దారు వయసు అర్హత నిబంధనల ప్రకారం ఉంటేనే ఆ దరఖాస్తును పరిశీలనకు పంపుతారు. లేకపోతే సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ స్థాయిలోనే తిరస్కరిస్తారు. దరఖాస్తుదారుకి ఆధార్ కార్డు మంజూరు సమయంలో వయసు తప్పుగా నమోదై తిరస్కరణకు గురైతే అపీల్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

అలాంటి దరఖాస్తుదారు వయసు ధ్రువీకరణ పత్రాలతో గ్రామ వార్డు సచివాలయంలో అపీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అపీల్ ను ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు స్వయంగా పరిశీలించి అర్హులైతే పింఛను మంజూరుకు డీఆర్ డీఏ పీడీలకు సిఫార్స్ చేస్తారు.ఈ ఏదాడి జనవరి నుంచి ఇప్పటివరకు 12.42 లక్షలమందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ఆధార్‌లో వయసు వివరాల్లో మార్పులు చేర్పులు చేసుకుని అర్హత లేకున్నా పింఛను పొందినవారిని గుర్తించేందుకు నవంబర్ లో పరిశీలన చేయబోతుంది. అర్హత లేకపోయిన ఆధార్ లో వయస్సు మార్చుకొని పింఛన్ కి అప్లై చేసుకొని తీసుకునే వారి పేర్లు జాభితా నుండి తీసేస్తాం అని సంబంధిత అధికారులు చెప్తున్నారు.