Begin typing your search above and press return to search.

ఏపీ ఓటర్లు డిసైడ్ కాలేదా..?

By:  Tupaki Desk   |   7 Jun 2023 9:00 PM GMT
ఏపీ ఓటర్లు డిసైడ్ కాలేదా..?
X
ఏపీ లో మరో తొమ్మిది నెలల లో ఎన్నిలలు రాబోతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గ సమావేశం తరువాత మంత్రుల తో మాట్లాడుతూ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెప్పారని అంటున్నారు. కేవలం తొమ్మిది నెలలు మాత్రమే ఉందని కష్టపడాల ని ఆయన కోరినట్లుగా కూడా అంటున్నారు.

అంటే ఏ విధంగా చూసినా ఏపీ లో ఎన్నికల గడువు దగ్గరపడుతోంది అన్న మాట. ప్రస్తుతం 2023 ఆరవ నేల సాగుతోంది. 2023 ముగిస్తే కనుక 2024 లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఎన్నికల వాతావరణమే కనిపిస్తుంది. ఇక ఏపీ లో చూసుకుంటే రాజకీయ పార్టీల సందడి ఒక్క లెక్కన ఉంది. వారి హడావుడి పీక్స్ లోనే ఉంది. ఈ ఏడాది జనవరి నెలాఖరు నుంచి లోకేష్ పాదయాత్ర చేపడుతూ వస్తున్నారు.

ఇంకో వైపు చంద్రబాబు జిల్లాల టూర్లు పెంచేశారు. ఆయన ఎండ వేడిమి ని సైతం లెక్కచేయకుండా జనాల్లోనే ఉంటూ వస్తున్నారు. అధికార వైసీపీ లో ముఖ్యమంత్రి జగన్ అన్నీ తానై నిర్వహిస్తున్నారు. ఆయనే జిల్లాల లో మీటింగ్స్ పెడుతున్నారు. పధకాల కు నగదు బదిలీ పేరిట బటన్ నొక్కుతున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి జనం లో ఉండేందుకు వారాహీ రధాన్ని బయట కు తీస్తున్నారు. ఇలా కనుక చూసుకుంటే ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీ గా ఉన్నారు. మరి జనాల మాటేంటి అంటే వారు మాత్రం ఎన్నికల గురించి కానీ ఆ ఊసు కానీ తలవడంలేదు. ఎన్నికలు వస్తూంటాయి. పోతూంటాయి అన్న నిర్వేదం అయితే వారి లో కనిపిస్తోంది అని అంటున్నారు.

ఏపీ లో ఎవరో రావాల ని తన దశను మారచాలని జనాలు కోరుకుంటున్నట్లుగా అయితే ఏమీ కనిపించడంలేదు. తెలుగుదేశం పార్టీ చూస్తే నాలుగు దశాబ్దాల నాటిది. ఆ పార్టీ ఎన్టీయార్ర్ తో మొదలెడితే చంద్రబాబు దాకా ఏకంగా ఇర వై రెండేళ్ళ కాలం పాటు పాలించింది. చంద్రబాబు ముమ్మారు సీఎం గా ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో మరోమారు ఆయన సీఎం అవుతారు అని ప్రచారం సాగుతోంది. అంటే టీడీపీ నుంచి చూస్తే చంద్రబాబు వైసీపీ నుంచి జగన్ సీఎం అభ్యర్ధులుగా ఉన్నారు. ఏ పార్టీని ఎన్నుకున్నా జనాల కు చూసేసిన సినిమాగానే ఉంటుంది అన్న మాట. దాంతో కొత్తదనం లేని ఎన్నికలు గా 2024ను చూడబోతున్నామన్న వైరాగ్యం లో కూడా ఏపీ జనాలు ఉన్నారని అంటున్నారు.

ఆ విధంగా ఆలోచిస్తే వారిలో నిర్వేదం కూడా కనిపిస్తోంది. ఇప్పటికి అయిదేళ్ల క్రితం చూస్తే అప్పటికే చంద్రబాబు వ్యైత్రేక గాలులు మొదలయ్యాయి. జగన్ పాదయాత్ర తో ప్రభంజనం కనిపించింది. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నామన్న ఆసక్తి అన్ని వర్గాల్లోనూ కనిపించింది. కానీ ఈసారి అయితే వైసీపీ లేకపోతే టీడీపీ అన్నట్లుగానే పొలిటికల్ సీన్ ఉండడంతో ప్రజలు కూడా ఏమీ డిసైడ్ చేసుకోవడం లేదు అని అంటున్నారు.

నిజాని కి ఏపీ లో పొలిటికల్ వాక్యూమ్ ఉంద ని అంతా అంటున్నారు. అధికారం మార్పిడి రెండు పార్టీలు రెండు వర్గాలకే పరిమితం అవుతూ వస్తున్న నేపధ్యం నుంచి కొత్త దనం వైపు తీసుకు ని వెళ్ళాల్సిన బాధ్యత ను రాజకీయ పార్టీలు విస్మరించాయి. జనసేన విషయమే తీసుకుంటే మంచి అవకాశాన్ని కాదనుకుంటోందా అన్న చర్చ కూడా సాగుతోంది. జనసేన తాను అధికారం లోకి రాలే ను అని ఎందుకు ఆలోచిస్తోందో కానీ పొత్తు బాట లో నడుస్తోంది అని అంటున్నారు.

అలా కాకుండా సొంతంగా జనసేన పోటీ చేసి ఉంటే జనాల లో కొత్త ఆల్టర్నేషన్ అన్న ఉత్సాహం అయితే వచ్చేది అని అంటున్నారు. ఇవన్నీ చూసినపుడు ఏపీ ప్రజలు మాత్రం ఇప్పటికీ ఎవరిని ఎన్నుకోవాలి అన్నది డిసైడ్ కాలేదు అనే అంటున్నారు. చంద్రబాబు వస్తే మళ్లీ అమరావతి అని అంటారని, జగన్ అయితే మూడు రాజధానుల పాట పాడతారని సగటు జనం గొణుక్కునే పరిస్థితి ఉంది.

అదే విధంగా అభివృద్ధి మాత్రం ఈ రెండు ప్రభుత్వాల లోనూ ఎక్కడా కనిపించలేద ని, పైగా అప్పుల కుప్పగా ఏపీ మారిందని కూడా చాలా మంది భావిస్తున్న నేపధ్యం ఉంది. ఈ మాత్రం సౌభాగ్యాని కి ఇప్పటి నుంచే అలసిపోయి ఆరాటపడడం ఎందుకు అన్న వేదాంత ధోరణి కూడా కనిపిస్తోంది. మొత్తానికి చూస్తే మాత్రం ఏపీ జనాలు ఇంకా ఒడ్డునే ఉండి అన్నీ చూస్తున్నారు. రాజకీయ పార్టీల పరుగు పందేల ను గమనిస్తున్నారు. మరి 2024 ఎన్నికల ముందు అయినా వారు ఒక నిర్ణయానికి వస్తారా అన్నది చూడాల్సి ఉంది.