Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న షురూ.. కొడాలి-బాలినేని-తోట‌ల‌కు ఛాన్స్‌!!

By:  Tupaki Desk   |   31 March 2023 6:55 PM GMT
ఏపీ మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న షురూ.. కొడాలి-బాలినేని-తోట‌ల‌కు ఛాన్స్‌!!
X
వచ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం అత్యంత జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా టీడీపీ-జ‌న‌సేన పొత్తు నేప‌థ్యంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని పార్టీ అదినేత సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలో సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌కు మ‌రోసారి తెర‌దీసిన‌ట్టు తెలిసింది. అదేస‌మ‌యంలో మంత్రివ‌ర్గంలో ఫైర్ బ్రాండ్స్‌కు అవ‌కాశం క‌ల్పించా ల‌ని కూడా నిర్ణ‌యించుకున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. నిజానికి ఇప్ప‌టికే మంత్రి వ‌ర్గంలో రెండు సార్లు మార్పులు చేశారు. 2019లో ఒక‌సారి, 2022 ఏప్రిల్‌లో మ‌రోసారి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు తెర‌దీశారు.

'సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌' పేరిట మంత్రి వ‌ర్గం విస్త‌ర‌ణ‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు ప్రాధాన్యం పెంచారు. అయితే.. సామాజిక వ‌ర్గం ప‌రంగా ఇది బాగున్నా.. ప‌నితీరు ప‌రంగా చూసుకుంటే మాత్రం మైన‌స్‌ల‌లో ఉంద‌ని పార్టీ అదినేత భావిస్తున్నారు. పైగా.. కీల‌క‌మైన ఎన్నిక‌ల‌కు ముందు .. మంత్రుల ప‌నితీరు బాగోలేద‌నే రిపోర్టులు కూడా వ‌చ్చాయి. పైగా.. ఇటీవ‌ల జ‌రిగిన గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల్లోనూ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ ఎదురైన ప‌రాభ‌వంతో మ‌రింత జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే మంత్రి వ‌ర్గంలో మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఉభయగోదావరి జిల్లాల నుంచి ఇద్దరు, అమరావతి ప్రాంతం నుంచి ఒకరు, సీమ జిల్లాల నుంచి ఒకరు, ఉత్తరాంధ్ర నుంచి ఒకరిని మార్చే అవకాశం ఉందని వైసీపీలో చ‌ర్చ‌ సాగుతోంది.

ఈ సారి కూడా ప్రాంతీయ, సామాజిక సమీకరణాలు దెబ్బ తినకుండా(సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌) కొత్త వారికి అవ‌కాశం క‌ల్పిస్తార‌ని తెలుస్తోంది. ముఖ్యంగా జ‌న‌సేన దూకుడును త‌గ్గించేందుకు.. కాపుల ఓటు బ్యాంకు చేజారి పోకుండా చేసేందుకు గోదావరి జిల్లాలో కాపు -బీసీ-ఎస్సీ వర్గాలను ప్రభావితం చేసే నేతలకు ఛాన్స్ ఉంటుందని అంటున్నారు.

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఎప్పుడు ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయ‌కుడుగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని, రెడ్డి వ‌ర్గానికి చెందిన బాలినేని శ్రీనివాస‌రెడ్డి, కాపుల కోటాలో తోట త్రిమూర్తులు కు అవ‌కాశం ద‌క్క‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. వీరిలో తోట త్రిమూర్తులు టీడీపీ నుంచి వ‌చ్చి వైసీపీ త‌ర‌ఫున ఎమ్మెల్సీ అయ్యారు.

ప్ర‌స్తుతం మంత్రి అప్పలరాజుకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో ఆయనకు తాడేపలికి రావాలనే పిలుపు రాజకీయంగా చర్చకు కారణం అవుతోంది. అదేవిధంగా.. కొత్తగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలకు మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వనున్నట్లు వైసీపీలో చ‌ర్చ సాగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.