Begin typing your search above and press return to search.

మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త ..ఏంటంటే ?

By:  Tupaki Desk   |   26 Sep 2020 10:10 AM GMT
మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త ..ఏంటంటే ?
X
గ్రామ-వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తాజగా గ్రామ,వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ఉద్యోగుల తరహాలోనే వారికి 180 రోజుల ప్రసూతి సెలవులు కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం రెండేళ్ల ప్రొబేషన్ కాలంలో విధులు నిర్వహిస్తోన్న గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి ప్రసూతి సెలవులను ఇవ్వలేదు.

దీనితో , వారు కూడా సెలవుల డిమాండ్ ‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మహిళా ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయంతో వేల సంఖ్యలో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సమయంలో లబ్ది చేకూరనుంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే గ్రామ, వార్డు సచివాలయాలను ప్రతీ జిల్లాలో ఏర్పాటు చేసింది. వీటిలో పనిచేసే ఉద్యోగులకు రూ.15 వేల వేతనం ఇస్తున్నారు. ప్రొబేషన్‌ కాలం పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే వీరికి సాధారణ ఉద్యోగుల తరహాలో జీత భత్యాలు, సెలవులు వర్తిస్తాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల నుంచి సెలవులపై విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకుని 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది.