ఏపీలో కరోనా పంజా.. మళ్లీ రికార్డ్ కేసులు

Wed Aug 05 2020 23:03:31 GMT+0530 (IST)

Pandemic paw in AP .. Record cases again

ఏపీలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. గత రెండు మూడు రోజులుగా కేసుల సంఖ్య కాస్తా తగ్గగా బుధవారం మళ్లీ పెరగడం కలకలం రేపుతోంది. టెస్టుల సంఖ్య పెంచడంతో కేసులు కూడా పెరుగుతున్నాయి.బుధవారం విడుదలైన ఏపీ కరోనా బులిటెన్ లో గత 24 గంటల్లో ఏపీలో ఏకంగా 10128 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ఏకంగా 77మంది కరోనాతో చనిపోవడం విషాదం నింపింది.

తాజా 10వేలకు పైగా కేసులో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 186461కు చేరాయి. తాజాగా 60576 టెస్టులు చేశారు. మొత్తం ఏపీలో మరణాల సంఖ్య 1681కి చేరింది.

కరోనా నుంచి బుధవారం 8729మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 104354గా నమోదైంది. 80426 యాక్టివ్ కేసులున్నాయి.

అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1544 కర్నూలులో 1368 అనంతపురంలో 1260 కేసులు నమోదయ్యాయి.