ఏపీ : మళ్లీ విద్యుత్ కష్టాలు

Mon Aug 15 2022 11:51:53 GMT+0530 (India Standard Time)

AP: Power problems again

విద్యుత్ బకాయిలు చెల్లించే క్రమంలో రాష్ట్రం వెనుకబడిపోతోంది. ఎందుకంటే ఇప్పటిదాకా రాష్ట్రం చెల్లించాల్సిన బకాయిలు వాయిదావేస్తూ వస్తోంది. అసలు  లెక్కింపు మొదలెడితేనే దడగా ఉంది సర్కారుకి. దాన్ని పూడ్చుకోవడానికి విద్యుత్ ఛార్జీల పెంపు అన్నది ఏటా చేస్తూనే ఉన్నారు. విద్యుత్ బిల్లుల వసూలు ట్రూ అప్ ఛార్జీలు ఇంకా చాలావిధాలుగా వసూలు చేస్తున్న మొత్తాలేవి ఇప్పుడు ఉత్పత్తి  సంస్థలకు చెల్లించేందుకు చాలడం లేదన్న వార్తలే వస్తున్నాయి.అంటే ఆ నిధులు కూడా ప్రభుత్వం డైవర్ట్ చేస్తుందా ? లేదా ఉద్దేశపూర్వకంగానే ఓ వెయ్యి కోట్ల రూపాయల బకాయిలను కూడా తీర్చలేకపోతుందా ? అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పంద్రాగస్టు వేళ ఆంధ్రప్రదేశ్ కు ఓ చేదు వార్త వినిపించింది కేంద్రం. వివిధ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సర్కారు చెల్లించాల్సిన బకాయి 1100 కోట్ల రూపాయలకు పైగానే ఉందని తేలింది. ఆ లెక్కన ఇకపై  బకాయిల చెల్లింపు లేనిదే విద్యుత్ పంపిణీకి సంబంధించి ఎటువంటి క్లియరెన్స్ ఇవ్వకూడదని కూడా సంబంధిత కేంద్ర ప్రభుత్వ వర్గాలు తేల్చాయి.

ఇదే విషయాన్ని ఇవాళ ఏపీలో ప్రధాన చర్చ. పేమెంట్ ర్యాటిఫికేషన్ అండ్ అనాలసిస్ ఇన్ పవర్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఇన్వాయిసింగ్ ఆఫ్ జనరేటర్స్ (ప్రాప్తి ) ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ బకాయిల లెక్కలు గురించి ఇప్పటికే ఓ  నోట్ రూపొందించిందని నిర్థారణ అయింది. ఈ మేరకు ఇకపై పాత బకాయిల చెల్లింపు లేనిదే విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి పంపిణీ వ్యవస్థకు సరఫరా ఉండదని తేలింది.

వాస్తవానికి ఎప్పటి నుంచో విద్యుత్ బకాయిల చెల్లింపు అన్నది లేదని సజావుగా సాగడం లేదని ఈ తరుణంలో దేశంలో పలు రాష్ట్రాలు ఉత్పత్తి సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు  నెలల తరబడి ఉంటున్నాయని ఓ ప్రాథమిక సమాచారం. ఈ కోవలో మన రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. స్వల్ప కాల వ్యవధిలో చెల్లించాల్సిన బకాయిలతో పాటు దీర్ఘ కాలంలో చెల్లించాల్సిన బకాయిలు కూడా ఉన్నాయి.

అంటే నలబై ఐదు రోజుల  కాల వ్యవధిలో చెల్లించాల్సిన మొత్తాలు అదేవిధంగా దీర్ఘ కాలికంగా చెల్లించాల్సిన మొత్తాలు అన్నీ కలుపుకుని చూస్తే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయి ఉందని తెలుస్తోంది. దీర్ఘకాలికం అంటే 180 రోజులు మించి ఉన్న బకాయిలు అని అర్థం. ఇవి కూడా భారీ మొత్తాల్లో ఉండడంతో కేంద్రం ఇప్పటికే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ వర్గాలను హెచ్చరించింది.