Begin typing your search above and press return to search.

కండోమ్స్ వద్దు.. ఆ ‘తృప్తి’ ఉండదు..

By:  Tupaki Desk   |   17 July 2019 6:55 AM GMT
కండోమ్స్ వద్దు.. ఆ ‘తృప్తి’ ఉండదు..
X
శృంగారం దివ్యౌషధం అంటారు. అది ఎంత చేస్తే అంత ఎనర్జీ అంటారు ఆ విభాగం వైద్యులు. అయితే లైంగిక చర్యలో తృప్తిని తగ్గించే కండోమ్ వాడకంలో మాత్రం తెలుగోళ్లు వెనుకబడిపోయారు. కండోమ్ వల్ల అస్సలు సుఖం లేదని దూరం పెడుతున్నారట.. తాజాగా విడుదలైన సర్వేలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.

1980వ దశకం వరకు విచ్చలవిడిగా సెక్స్ జరిగేది. కానీ ఎప్పుడైతే ఎయిడ్స్ మహ్మమారి వచ్చిందో అప్పటి నుంచి ఈ రక్షిత చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే వచ్చేసింది కండోమ్స్. ఈ కండోమ్స్ వల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఎయిడ్స్ తదితర సుఖ వ్యాధులకు చెక్ చెప్పవచ్చు. పిల్లలు ఇప్పుడే వద్దు అనుకునే వారు దీన్ని సాధనంగా వాడవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా కండోమ్స్ వాడకం బాగానే ఉన్నప్పటికీ దేశంలో ముఖ్యంగా తెలుగునేల పై మాత్రం కండోమ్స్ వాడడానికి తెలుగు పురుషులు అస్సలు ఇష్టపడడం లేదట.. తాజాగా ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విడుదల చేసి నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి.

ఏపీలో కండోమ్స్ వాడేవారి శాతం కేవలం 0.2శాతం మాత్రమే. ఇక తెలంగాణలో కాస్త ఎక్కువగా 0.5శాతం. అంటే అరశాతమే.. 100శాతంలో ఇది కేవలం 1 శాతంలో సగం మాత్రమే. ఏపీలో అంతకంటే తక్కువే. అంటే కండోమ్స్ వాడని వారిలో ఏపీ పురుషులు ఫస్ట్.. తెలంగాణ పురుషులు దేశంలోనే సెకండ్ ఉన్నారన్న మాట..

దీన్ని బట్టి మన తెలుగు పురుషులు కండోమ్స్ వాడకంపై అయిష్టతను చూపుతున్నారు. శృంగారంలో కండోమ్ వాడకం వల్ల భావప్రాప్తి ఉండదన్నది పురుషుల వాదన. స్కిన్ టు స్కిన్ టచ్ మాత్రమే తాము బాగా ఆస్వాదిస్తామని అంటున్నారు. జనాభా నియంత్రణ, సుఖ వ్యాధులు వంటి వాటిని తెలుగు జనాలు పట్టించుకోవడం లేదు. మహిళలకే వాటిని వదిలేస్తున్నారు. కేవలం శృంగారంలో సుఖానికే కండోమ్ ను దూరం పెడుతున్నారని అర్థమవుతోంది.

అయితే తెలిసిన భాగస్వాములతో సెక్స్ అయితే ఫర్వాలేదు కానీ వేరే వాళ్లతో ఇలా కండోమ్స్ లేకుండా భావప్రాప్తి కోసం సెక్స్ చేస్తేనే ప్రమాదం. ఈ పరిస్థితి ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుంది.