డ్రగ్స్‌లో నెంబర్ -1 ఏపీనే: కేంద్రం

Tue Dec 06 2022 09:24:44 GMT+0530 (India Standard Time)

AP No.1 in Drugs: Centre

అదేంటో ఏపీని చూస్తే.. జాలేస్తోందని అంటున్నారు మేధావులు. ఒకప్పుడు పరిశ్రామిక రంగంలోను పెట్టుబడుల సాధనలోనూ ఐటీలోనూ ముందున్న నవ్యాంధ్ర.. ఇప్పుడు మాదక ద్రవ్యాల విషయంలో దేశంలోనే నెంబర్ 1 గా ఉండడాన్ని చూసి వారు విస్తు పోతున్నారు. ఇదేదో ప్రతిపక్షం టీడీపీ గిట్టక చేసిన ఆరోపణ కాదు.. ప్రబుత్వంపై కుట్ర చేసిన కామెంట్లు అంతకన్నాకాదు. సాక్షాత్తూ.. సీఎం జగన్‌ను తన దత్తపుత్రుడిగా భావించే ప్రధాని మోడీ ఏలుబడిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చెప్పిన నిష్ఠుర సత్యం.దేశంలో అత్యధిక స్థాయిలో డ్రగ్స్ పట్టుబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ నెంబర్ 1 పొజిషన్‌లో ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామనే కుండబద్దలు కొట్టారు. అత్యధికంగా ఏపీలో 18267.84 కిలోల మాదకద్రవ్యాలను(గంజాయితోపాటు) స్వాదీనం చేసుకున్నట్టు ఆమె నివేదిక కూడా సమర్పించారు.

ఢిల్లీలో జరిగిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) 65వ ఎడిషన్‌లో ఈ నివేదికను స్వయంగా నిర్మలా సీతారామన్ బహిర్గత పరిచారు.

2021-22లో అక్రమ రవాణా చేస్తున్న డ్రగ్స్ బంగారం ఇతర వస్తువలు వివరాలతో 'ఇండియా స్మగ్లింగ్ నివేదిక' ను  డీఆర్ ఐ అధికారులు రూపొందించారు. గంజాయితో సహా ఇతర డ్రగ్స్ అన్ని కలిపి ఏపీలోనే  అత్యధికంగా స్వాధీనం చేసుకున్నట్లు ఆమె వివరించారు.

అత్యధికంగా ఏపీలో 18267.84 కిలోలు ఈశాన్య రాష్ట్రం త్రిపురలో 10104.99 కిలోలు అస్సాంలో 3633.08 కిలోలు తెలంగాణలో 1012  కిలోలను కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయని వివరించారు.

అంతేకాదు  వీటికి సంబంధించి ఏపీలో 90 మందిని తెలంగాణలో ఐదుగురిని కేంద్ర బలగాలు ఆరెస్టు చేశాయి. తమ సంస్థ ఏపీలో 1050 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసిందని డీఆర్ఐ పేర్కొంది. హైదరాబాద్‌లో 3.2 కిలోలను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. కాగా దేశవ్యాప్తం రూ. 97 కోట్ల విలువైన 16189 టన్నుల ఎర్ర చందనం స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.