తెలంగాణ తిట్లు.. ఏపీ ప్రశంసలు.. వెరైటీ పాలిటిక్స్ బ్రో!

Tue Dec 06 2022 13:00:01 GMT+0530 (India Standard Time)

AP Minister Pinipe Viswarup on kcr

తెలంగాణ ఏపీ రాజకీయాలను చూస్తే.. మస్త్ దిమా ఖరాబై పోద్ది! ఎందుకంటే.. ఏపీ నేతలను మంత్రులను ప్రభుత్వాన్ని కూడా తెలంగాణ మంత్రులు నాయకులు ఆడేసుకుంటుంటారు. ఎప్పుడు ఛాన్స్ చిక్కితే.. అప్పుడు విమర్శలు చేస్తుంటారు. విధానాలను కూడా తప్పుబడుతుంటారు. దీంతో అప్పుడప్పుడు.. ఏంటిలా చేస్తున్నారనే చర్చ కూడా వస్తుంటుంది. అయితే.. ఇదే సమయంలో తెలంగాణపై మాత్రం ఏపీ మంత్రులు ప్రశంసల జల్లు కురిపిస్తుండడం గమనార్హం.తాజాగా ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రసంశల జల్లు కురిపించారు. యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోతారన్నారని మంత్రి విశ్వరూప్ అనడం.. సంచలనంగా మారింది.

తాజాగా ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాలోని  నరసింహ స్వామి ఆలయాన్ని సతీసమేతంగా దర్శించుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ప్రపంచమే అబ్బురపడే విధంగా యాదాద్రి పుణ్యక్షేత్రాన్నిసీఎం కేసీఆర్  తీర్చిదిద్దారని కొనియాడారు. కేసీఆర్కు ఆయన ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంతో దేశ చరిత్రలోనే కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. తనకు ఆరోగ్యం క్షీణించడంతో స్వామివారికి మొక్కి.. ముంబైకి వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు పినిపే చెప్పారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.