Begin typing your search above and press return to search.

రాహుల్ పిలుస్తున్నారు... జగన్ ఏమంటారో...?

By:  Tupaki Desk   |   29 Jan 2023 10:00 PM GMT
రాహుల్ పిలుస్తున్నారు... జగన్ ఏమంటారో...?
X
దేశ్ కి నేత కావాలని తపనతో పట్టుదలతో గత అయిదు నెలలుగా కన్యాకుమారీ నుంచి కాశ్మీర్ దాకా కాలి నడకన సాగిన రాహుల్ గాంధీ సుదీర్ఘమైన పాదయాత్ర రేపటితో ముగుస్తోంది. ఈ పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఏకంగా మూడు వేల అయిదు వందల కిలోమీటర్ల దూరం పై చిలుకు అండిచారు. పది రాష్ట్రాల గుంద్డా ఆయన పాదయాత్ర సాగింది. భారత్ జోడీ యాత్ర పేరిట దేశంలోని తటస్థులను ఆయన కదిలించగలిగారు.

అంతే కాదు తటస్థ రాజకీయ నాయకత్వాన్ని నాయకులను పార్టీలను ఎంతో కొంత తన వైపునకు తిప్పుకోగలిగారు. అలా రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతం అయిందనే చెప్పాలి. ఈ యాత్ర ముగింపు సభను కాశ్మీర్ లో ఈ నెల 30న నిర్వహించనున్నారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో గాంధీ తరువాత ఇంత పెద్ద ఎత్తున పాదయాత్ర చేసిన నాయకుడిగా రాహుల్ గాంధీ చరిత్ర సృష్టించారు.

అదే టైం లో కాంగ్రెస్ కి ఎంతో కొంత బలాన్ని అందించారు. పార్టీ శ్రేణులకు ఆశ కల్పించారు. దేశంలో కాంగ్రెస్ బలం ఇంకిపోలేదని కూడా తెలియచెప్పారు. మరి ఈ ముగింపు సభ ద్వారా రాజకీయ వ్యూహాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. అందుకే దేశంలోని బీజేపీయేత పార్టీలుగా భావిస్తూ 23 పార్టీలకు ఆహ్వానం పంపారు. ఈ పార్టీల నేతలు అంతా రాహుల్ తో చేయి కలిపితే సులువుగా బీజేపీని గద్దే దించవచ్చు అన్న ఆలోచనతోనే కాంగ్రెస్ ఈ అహ్వానం పంపింది.

కాంగ్రెస్ తో ఇప్పటిదాకా మిత్రులుగా ఉన్న వారికి ఆహ్వానాలు అందాయి. అలాగే పాదయాత్రలో కలసిన వారికి అందాయి. కానీ చిత్రమేంటి అంటే కాంగ్రెస్ తో ఎపుడూ కలవని వైసీపీకి కూడా ఇన్విటేషన్ రావడం. రాహుల్ పాదయాత్ర ముగింపు సభకు హాజరు కావాలని వైసీపీకి ఆహ్వానం లభించడం అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు. దాని మీదనే ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

ఇప్పటికి పన్నెండు ఏళ్ల క్రితం కాంగ్రెస్ ని వద్దు అనుకుని జగన్ బయటకు వచ్చారు. నాడు సోనియా రాహుల్ నాయకత్వాన అప్రతిహతంగా కేంద్రంలో అధికారం చలాయిస్తున్న యూపీయే సర్కార్ ఉంది. అలా అధికారాన్ని కాంగ్రెస్ ని సైతం వదులుకుని జగన్  బయటకు వచ్చారు. ఆ మీదట ఆయన సొంతంగా వైసీపీని ఏర్పాటు చేసుకుని పోరాడి సీఎం అయ్యారు.

ఇక కాంగ్రెస్ పార్టీ మీద మొదట్లో విమర్శలు చేసిన జగన్ గత కొన్నేళ్ళుగా ఎక్కడా ఆ పార్టీ పేరు కూడా ఉచ్చరించడంలేదు. ఆయన తన రూట్ క్లియర్ అని చెబుతున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీతోనే అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇది రాజకీయాలకు అతీతమైనది అని విశాఖ సభలో జగన్ స్వయంగా చెప్పారు. అంటే బీజేపీ వంటి పార్టీతో కాదు మోడీతోనే తన బంధం అని జగన్ చెప్పారని అంటున్నారు.

అదే బీజేపీలో నాయకులు మారినా మోడీ స్థానం కదిలినా జగన్ బీజేపీ రిలేషన్స్ ఎలా ఉంటాయో కూడా ఆయన చెప్పకనే చెప్పారు అని అంటున్నారు. అయితే కేంద్రంలో మూడవసారి కూడా మోడీ నాయకత్వాన బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి కాబట్టి జగన్ పొలిటికల్ స్టాండ్ ఇప్పట్లో మార్చుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఇక కాంగ్రెస్ ని విమర్శించకుండా జగన్ ఉన్నారు మరి కాంగ్రెస్ పట్ల ఆయన ఆలోచనలు ఏంటి అవి గతం కంటే ఇపుడు వేరుగా ఉన్నాయా మారాయా అన్నది కూడా చర్చగా ఉంది.

అయితే జగన్ మాత్రం కాంగ్రెస్ కి దూరమే అని ఆ పార్టీ వారు చెబుతూ ఉంటారు. ఇక చూస్తే బీజేపీకి యాంటీగా ఉన్న ఏ కూటమిలోనూ బాహాటంగా ఇప్పటికిపుడు వైసీపీ కలిసే చాన్స్ లేదనే అంటున్నారు. ఆ పరిస్థితులు వచ్చినపుడు అలాంటి అవకాశాలు ఉన్నపుడు అపుడు ఆలోచిస్తారేమో కానీ ఇప్పటికి అయితే బయటపడే ప్రశ్నే లేదు అని అంటున్నారు. మరి వైసీపీని ఇంతకాలం పిలవని కాంగ్రెస్ ఇపుడు ఎందుకు పిలిచింది అది కూడా రాహుల్ పాదయాత్ర ముగింపు వేళ పిలవడం అంటే కూడా ఆలోచించాల్సిందే. ఏది ఏమైనా ఇది రాజకీయం ఇక్కడ ఏమైనా జరగవచ్చు. అయితే దానికి సమయం సందర్భం ఉంటుంది.

ప్రస్తుతానికి ఈ ఇన్విటేషన్ ఒక సంకేతం అని అనుకున్నా అనుకోవచ్చు. ఏది ఏమైనా రాహుల్ సభకు వైసీపీని పిలవడం మాత్రం చర్చగానే ఉంది. అదే సమయంలో బీయారెస్ కి కూడా ఆహ్వానం అందింది. మరి చంద్రబాబుని పిలిచారో లేదో ఇప్పటికి అయితే తెలియదు. అదీ మ్యాటర్.