Begin typing your search above and press return to search.
ముఖ్యమంత్రి గారూ ఈ పనొక్కటి చేయొచ్చు గా
By: Tupaki Desk | 16 Aug 2022 4:47 AMఏపీ ముఖ్యమంత్రి తెలుగు భాష ను పలికే విధానం రెగ్యులర్ గా ట్రోల్స్ వస్తున్నాయి. గతంలో వైసీపీ ఏ విషయంలో అయితే లోకేష్ ను నిందించిందో.... అదే విషయంలో లోకేష్ కంటే ఎక్కువ సార్లు జగన్ ప్రతిపక్షాలకు దొరికిపోతున్నారు. చర్చకు తావిస్తున్న ఈ రాజకీయ సంబంధ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివాదాల్లో ఇరుక్కుంటున్నారు.
సాధారణంగా అయితే ఇదంత చర్చ అయ్యేది కాదు. కానీ ఒకవైపు పక్క రాష్ట్రానికి తెలుగు పండితుడు వంటి కేసీఆర్ ఉండటం, గతంలో లోకేష్ తెలుగును వైసీపీ బాగా కామెంట్ చేయడం వల్ల జగన్ ప్రసంగాలు ఉంటే తెలుగుదేశం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది.
ఓ తెలుగు రాష్ట్రాన్ని నడిపే నేత తెలుగు భాష ఎంత బాగుండాలి. తెలుగు నుడికారంలో స్వచ్ఛమయిన పలుకు, ఉచ్ఛారణ దోషాలకు తావివ్వని పలుకు ఉంటే ఎంతో బాగుంటుంది. ఇప్పటికీ అనేక పర్యాయాలు ఆయన ఇదేవిధంగా తెలుగు పదాలు తప్పులు పలికి విపక్ష శ్రేణుల విమర్శలకు గురయ్యారు. అయినా కూడా ఆయన పలుకులో మార్పులేదు. ఉటంకించారు అన్న పదం పలకడంలో తడబాటు. స్వేచ్ఛ అన్న పదం పలకడంలో తడబాటు లేదా తప్పటడుగు. స్వేచ్ఛం అని ఆయన పలుకుతారు. ఉటకించారు అని పలుకుతారు. ఇంకా చాలా పదాలు ఆ జాబితాలో ఇరవైకి పైగా పదాలు తప్పులే ఉంటాయి. పోనీ ఇదేమయినా మొదటి సారి అని అనుకుని తప్పుకోవాలా అంటే లేదు ఎన్నో సార్లు ఆయన ఈ విధంగా భాషకు సంబంధించిన ఈ తప్పులు చేస్తూ ఉన్నారు.
ఓ భాషను పలికే తీరు, సంబంధిత మాండలిక ప్రధానం అయిన తీరు, ఇంకా చెప్పాలంటే భాషే ప్రాధాన్యం ఉంటూ పలికే సందర్భాలు, నిన్నటి వేళ మాదిరిగా నిలిచే చారిత్రక సందర్భాలు, అలాంటి వేళ ఎంత బాధ్యతగా ఉండాలి. తప్పులను పలకకూడదు అన్న కనీస స్పృహ లేకపోవడం విషాదం. పద లాలిత్యం..అర్థం, అర్థ సంబంధ అన్వయం ఇవేవీ తెలియకపోవడం విషాదం. తెలుగు గ్రామర్ పై జగన్ కి అస్సలు అవగాహన లేదు అని తేలిపోయింది. జగన్ లో కడప యాస లేదు. తెలుగు స్వచ్ఛత లేదని తెలుగుదేశం పదేపదే విమర్శిస్తోంది.
మరి ఇతరులు చేయడం లేదా అంటే చేస్తున్నారు. ఎన్టీఆర్ కూడా జ్ఞానం బదులు గ్నానం అని పలికేవారు. ఇది మినహాయిస్తే ఎన్టీఆర్ తెలుగు అద్భుతంగా ఉండేది. ఆ తర్వాత కేసీఆర్ తెలుగు మరెంతో బాగుంటుంది. యాసలో భాషలో కేసీఆర్ ఇప్పట్లో నెం.1 అని చెప్పాలి. చంద్రబాబు కూడా కోసం పదాన్ని కోసరం అంటారు. ఇప్పటికీ బదులు ఇప్పిటికీ అంటుంటారు. అయితే... ఇవి మిస్టేక్స్ కాదు, సీమ వాడుక పదాలు.
మరీ ! స్వేచ్ఛ అన్న పదం పలకలేని స్థితిలో అయితే ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రీ లేరు. ఇకపై ఉండరు కూడా ! కవితాత్మక ధోరణుల్లో మాట్లాడనసవరం లేదు కానీ మాండలిక ప్రధానం గా కూడా మాట్లాడి తీరాల్సిన పని లేదు కానీ తెలుగులో బేసిక్ తప్పులు చేయకుండా మాట్లాడితే చాలు కదా అన్నది ఏపీ ప్రజల అభిలాష.