Begin typing your search above and press return to search.

పారిస్ పిలుస్తోంది : నెల గ్యాప్ లో మరో ట్రిప్

By:  Tupaki Desk   |   28 Jun 2022 2:30 AM GMT
పారిస్ పిలుస్తోంది : నెల గ్యాప్ లో మరో ట్రిప్
X
జగన్ దావోస్ ట్రిప్ ముగిసి సరిగ్గా నెల రోజులు కూడా కాలేదు. ఇపుడు చలో పారిస్ అంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఎక్కువగా విదేశీ యాత్రలు చేయలేదు. కానీ 2022లో ఒక నెలలోనే రెండు విదేశీ పర్యటనలు చేస్తూ తనకు తానుగా కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు.

జగన్ గత నెల 20న దావోస్ ట్రిప్ కోసం వెళ్ళి 30న తిరిగి వచ్చారు. అంటే పది రోజులు కచ్చితంగా ఆ ట్రిప్ కొనసాగింది అన్న మాట. ఇక జూన్ లో చూస్తే 27 రోజులు ఆయన ఏపీలోనే ఉన్నారు. మధ్యలో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి వచ్చారు. అది వేరే సంగతి.

ఇపుడు ఆయన పారిస్ టూర్ పెట్టుకున్నారు. అయితే దావోస్ కి పారిస్ కి మధ్య తేడా చాలా ఉంది. దావోస్ సీఎం అధికారిక పర్యటన. పారిస్ మాత్రం కంప్లీట్ గా ప్రైవేట్ టూర్. జగన్ కుమార్తె చదువుకుంటున్న కళాశాలలో స్నాతకోత్సవం జరుగుతోంది. దానికి ఆయన సతీసమేతంగా హాజరవుతున్నారు. ఈ మేరకు విదేశీ ట్రిప్ కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ కోర్టు పది రోజుల పాటు జగన్ పారిస్ ట్రిప్ చేసేందుకు అనుమతి మంజూరు చేసింది.

దాంతో 28న సాయంత్రం జగన్ పారిస్ ఫ్లైట్ ఎక్కబోతున్నారు. జూలై 2న కళాశాల స్నాతకోత్సవం ఉంది. అది చూసుకుని జూలై మూడవ తేదీ నాటికి ఆయన తాడేపల్లికి తిరిగి చేరుకుంటారు. జూలై 4న ఏపీకి వచ్చే ప్రధాని నరేంద్ర మోడీతో కలసి అనేక కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. మొత్తానికి జగన్ ఫ్రమ్ పారిస్ అన్నది ఒక వారం పాటు సాగనున్న వ్యవహారం.