జగనన్న బస్సు అదిగో.. ! ఫలితం ఏమౌతుందో !

Thu May 26 2022 08:00:01 GMT+0530 (IST)

AP CM Ys Jagan Mohan Reddy

రాజకీయాలన్నవి రిజల్ట్ ఓరియెంటెడ్. మంచి జరిగితే ఓ మాట చెడు జరిగితే నాలుగు మాటలు వినిపించడం వెరీ కామన్. ఇవేవీ లేకుండా పరిణామాలను అంగీకరించడం విశ్లేషించడం వివరించడం అన్నవి జరగని పని! రేపటి నుంచి సామాజిక న్యాయభేరి పేరిట జగన్ క్యాబినెట్ కు చెందిన బీసీ ఎస్టీ మంత్రులు బస్సు యాత్ర చేయనున్నారు. శ్రీకాకుళం నుంచీ యాత్ర ప్రారంభించనున్నారు.ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. బీసీలను ఆదుకుంటున్న ప్రభుత్వం తమదేనన్న బలమైన ప్రతిపాదనతోనూ సంబంధిత అజెండాతోనూ మంత్రులు మాట్లాడనున్నారు. ఇలాచేస్తే జనం జగన్ కు జేజేలు పలుకుతారు అన్నది ఓ అభిప్రాయం వైసీపీ వర్గాల్లో ఉంది.

ఇదే సమయంలో బీసీ సంక్షేమం పేరిట ఇస్తున్న నిధులు ఎన్ని వాటికి సంబంధించి కేటాయింపులు ఎన్ని అన్న వాటిపై ఓ లెక్క తేల్చాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. వాస్తవానికి వైసీపీ వచ్చాక బీసీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందన్నది వారి వాదన. ఒక్క బీసీ కార్పొరేషన్ మాత్రమే కాదు ఎస్సీ ఎస్టీ  వర్గాలకు చెందిన కార్పొరేషన్లు కూడా ఆర్థికంగా పూర్తిగా అతీగతీ లేకుండా పోయాయి. ఇదివరకూ వీళ్ల కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో ట్రైనింగ్ సెంటర్లు నడిచేవి. ఇప్పుడవి లేకుండా పోయాయి.

వీలున్నంత వరకూ సంక్షేమ పేరిట పథకాలను ప్రకటిస్తూ ఉన్నారే తప్ప వాటికి కేటాయించే నిధులు కొన్ని సక్రమంగా  వినియోగానికి నోచుకోవడం లేదు. అర్హుల లెక్క అంతా కప్పల తక్కెడ మాదిరిగా ఉందన్నది ఓ వర్గం వాదన. ఈ తరుణంలో మంత్రులు ధర్మాన కానీ బొత్స కానీ ఉత్తరాంధ్ర కోటరీలో తమ సత్తా నెగ్గించుకోవాలని చూస్తన్నారు. అవి సాధ్యం అవుతాయో లేదో రేపటి వేళ నుంచి పరిశీలించాలి.