Begin typing your search above and press return to search.

అమెరికా లో భారత సంతతి యువకుడు కాల్చివేత

By:  Tupaki Desk   |   30 May 2023 11:05 AM GMT
అమెరికా లో భారత సంతతి యువకుడు కాల్చివేత
X
దేశం కాని దేశంలో భారత మూలాలు ఉన్న యువకుడ్ని గుర్తు తెలియని దుండగులు పొట్టన పెట్టుకున్నారు. గన్ కల్చర్ ఎక్కువగా ఉండే అమెరికాలో.. ఎలాంటి తప్పు చేయకున్నాపలువురు అమాయకులు బలి కావటం తెలిసిందే.

తాజా ఉదంతం కూడా ఈ కోవకు చెందినదే. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో చోటు చేసుకున్న తాజా దారుణంగా భారత సంతతికి చెందిన 21 ఏళ్ల విద్యార్థి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో మరణించారు.

కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన కుటుంబం 30 ఏళ్ల క్రితం అమెరికాకు వలస వెళ్లారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి బాధితుడు తాను పని చేస్తున్న స్టోర్ నుంచి బయటకు వచ్చి.. ఇంటికి వెళుతున్న క్రమంలో ఇద్దరు దుండగులు కాల్పులు జరిపినట్లుగా ఖలీజా టైమ్స్ పేర్కొంది.

ఈ కాల్పల్లో 21 ఏళ్ల భారత సంతతి యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నట్లుగా పేర్కొన్నారు. అతన్ని జూడ్ చాకోగా పోలీసులు గుర్తించారు.

దొంగతనానికి పాల్పడేందుకు వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా జరిపిన కాల్పులకు జూడో చాకో బలయ్యాడు. అతని భౌతికాయానికి ఫిలడెల్ఫియాలోని మలంకర కాథలిక్ చర్చిలో అంతిమ సంస్కారాలు జరుగుతాయని చెబుతున్నారు.

గత నెలలో ఏపీకి చెందిన 24ఏళ్ల సతీశ్ వీర అనే విద్యార్థి సైతం ఇదే తీరులో గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులకు బలయ్యాడు. అక్కడి ఫ్యూయల్ స్టేషన్ లో పని చేసే అతన్ని.. చోరీకి వచ్చిన దుండగులు కాల్చేయటం తెలిసిందే.