గర్ల్ ఫ్రెండ్ తో సెక్స్ చేస్తూ యువకుడు మృతి

Wed Jul 06 2022 10:29:25 GMT+0530 (India Standard Time)

A young man died while having sex with his girlfriend

శృంగారం ఆరోగ్యకరం.. అని పలు సందర్భాల్లో వైద్యులే చెబుతున్నారు. కానీ ఇటీవల కాలంలో ఈ శృంగారంలో పాల్గొంటుండగా మరణించేవారి సంఖ్య ఎక్కువవుతోంది. కొన్ని రోజుల కిందట ఓ వృద్ధుడు సెక్స్ లో పాల్గొంటుండగా హఠాత్తుగా మరణించాడు. అయితే వయసు మళ్లిన వ్యక్తి కావడంతో లైట్ గా తీసుకున్నారు. కానీ తాజాగా ఓ యవకుడు సైతం లైంగిక క్రియల్లో ఉన్నప్పుడు గుండెపోటుతో మరణించాడు.అయితే ఈ యువకుడు అంతకుముందు ఆరోగ్యంగానే ఉన్నాడని అతనికి ఎలాంటి డిసీజ్ లేవని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తెలిపారు. కానీ సెక్స్ లో పాల్గొంటుడగా అతను చనిపోవడం చర్చనీయాంశంగా మారింది.  ఇంతకీ శృంగారంలో పాల్గొంటుండగా మరణించిన వ్యక్తి ఎవరు..? అసలేం జరగింది..?

నాగపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజయ్ అనే వ్యక్తి డ్రైవర్ గా వెల్డింగ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. అతనికి ఫేస్ బుక్ ద్వారా మధ్యప్రదేశ్ లోని చింద్వాడాకు చెందిన 23 ఏళ్ల యువతి పరిచయమైంది. ఈమె నర్సుగా పనిచేస్తోంది. వీరి పరిచయం ఆ తరువాత ప్రేమలో పడ్డారు. ఈ విషయం రెండు కుటుంబాల్లో తెలియడంతో త్వరలో పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో వీరిద్దరు కలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 3న సాయంత్రం 4 గంటలకు నాగ్ పూర్ లోని ఓ లాడ్జికి వెళ్లారు.

అయితే యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ తో సెక్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతని గర్ల్ ఫ్రెండ్ వెంటనే లాడ్జి నిర్వాహకులకు ఈ విషయాన్ని చెప్పింది. లాడ్జి సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొన్ని పరీక్షలు నిర్వహించిన తరువాత అతను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని చెప్పారు. అతని గర్ల్ ఫ్రెండ్ కూడా తనకు కాబోయే భర్త ఎలాంటి మెడిసిన్స్ వాడలేదని తెలిపినట్లు పోలీస్ కమిషనర్ సతీష్ పాటిల్ తెలిపారు.

అయితే మరిన్ని వైద్య పరీక్షల కోసం అతని రక్తనమూనాలు పంపించగా అతనికి ఎలాంటి డిసీజ్ లేవని తేలిసింది. అయితే గుండెపోటుతో యువకుడు మరణించినట్లు వైద్యులు పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు.

సెక్స్ చేస్తుండగా గుండెపోటు రావడం చాలా అరుదుగా జరుగుతుంటాయని వైద్యులు తెలుపుతున్నారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఆనంద్ సంచేటి మాట్లాడుతూ కరోనరో ఆర్టెరీ డిసీజ్ తో 20 ఏళ్ల యువకులు మరణిస్తారని తెలిపారు. కరోనరీ ఆర్టెరీ డిసీజ్  కు సరైన చికిత్స తీసుకోని పక్షంలో సెక్స్ లో పాల్గొనడంతో.. ఆ కార్యక్రమానికి ఎక్కువ ఎనర్జీ కావాల్సి ఉంటుంది. దీంతో యువకులైనా గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కవగా ఉంటాయని తెలిపారు.